PM Modi: నుదిట సిందూరాన్ని తుడిచిన వాళ్లను మట్టిలో కలిపేశాం
- నుదిట సిందూరాన్ని తుడిచిన వాళ్లను మట్టిలో కలిపేశాం
- గుజరాత్‌లోని భుజ్‌లో జరిగిన ర్యాలీలో మోడీ వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మన సోదరీమణుల సిందూరాన్ని తుడిచిపెట్టిన వాళ్లను మట్టిలో కలిపేశామని ప్రధాని మోడీ అన్నారు. గుజరాత్‌లోని భుజ్‌లో జరిగిన ర్యాలీలో ప్రధాని మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా మరొకసారి పాకిస్థాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. సిందూర్ అనేది వివాహానికి సంకేతమని.. దానిని తుడిచివేయడం అంటే వైధవ్యాన్ని సూచిస్తుందన్నారు. మన సోదరీమణుల నుదిట నుంచి దాన్ని తుడిచేసే ధైర్యం చేసిన వాళ్లను ఖతం చేశామని చెప్పారు. ఇక మోడీని ఢీకొట్టడం ఎంత కష్టమో ఉగ్రవాదులు కూడా కలలో ఊహించి ఉండకపోవచ్చన్నారు. మన త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చామని.. దీంతో ఆపరేషన్ సిందూర్ ద్వారా ప్రపంచం చూడని విధంగా అద్భుతాలు సృష్టించారని ప్రశంసించారు.
ఇది కూడా చదవండి: YSR-Kadapa District: మరోసారి మారిన కడప జిల్లా పేరు.. ఉత్తర్వులు జారీ..
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
భారతదేశం పట్ల దాయాది దేశం పట్ల ద్వేషం కక్కుతోందని.. భారత్‌కు హాని చేయాలనే పాకిస్థాన్ కోరుకుంటోందని తెలిపారు. భారత్ లక్ష్యం పేదరిక నిర్మూలన, ఆర్థికాభివృద్ధిని పెంపొందించడం, అభివృద్ధిని చెందిన దేశంగా మార్చడమే లక్ష్యమని చెప్పారు. ఇక వెనుకబడిన ప్రాంతాలకు అభివృద్ధిని తీసుకెళ్లడమే ప్రభుత్వ విధానమని చెప్పారు. హోలీ, దీపావళి, గణేష్ పూజ వంటి పండుగల సమయంలో భారతదేశంలో తయారైన ఉత్పత్తులను కొనుగోలు చేసి ఉపయోగించాలని ప్రజలను మోడీ కోరారు. విదేశీ దిగుమతులను కొనుగోలు చేయడం మంచిది కాదని చెప్పారు. ప్రతి ఒక్కరూ స్వదేశంలో తయారైన వస్తువులనే కొనుగోలు చేసేందుకు సంకల్పించుకోవాలని కోరారు.
ఇది కూడా చదవండి: Viva Harsha : లగ్జరీ కారు కొన్న వైవా హర్ష.. ఎన్ని కోట్లో తెలుసా..?
ఇక అంతకముందు వడోదర విమానాశ్రయం నుంచి నగర శివార్లలోని వైమానిక దళ స్టేషన్ వరకు మోడీ రోడ్ నిర్వహించారు. స్వాగతం పలికిన జనంలో కల్నల్ ఖురేషి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు.
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది చనిపోయారు. దీనికి ప్రతీకారంగా భారత్.. ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. దాదాపు 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అంతేకాకుండా పాకిస్థాన్‌లో పలు చోట్ల వైమానిక స్థావరాలు నాశనం అయ్యాయి. అయితే పాకిస్థాన్ కాళ్ల బేరానికి రావడంతో భారత్ కాల్పుల విరమణకు అంగీకరించింది.
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!