Site icon NTV Telugu

PM Modi: నుదిట సిందూరాన్ని తుడిచిన వాళ్లను మట్టిలో కలిపేశాం

Pmmodi

Pmmodi

మన సోదరీమణుల సిందూరాన్ని తుడిచిపెట్టిన వాళ్లను మట్టిలో కలిపేశామని ప్రధాని మోడీ అన్నారు. గుజరాత్‌లోని భుజ్‌లో జరిగిన ర్యాలీలో ప్రధాని మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా మరొకసారి పాకిస్థాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. సిందూర్ అనేది వివాహానికి సంకేతమని.. దానిని తుడిచివేయడం అంటే వైధవ్యాన్ని సూచిస్తుందన్నారు. మన సోదరీమణుల నుదిట నుంచి దాన్ని తుడిచేసే ధైర్యం చేసిన వాళ్లను ఖతం చేశామని చెప్పారు. ఇక మోడీని ఢీకొట్టడం ఎంత కష్టమో ఉగ్రవాదులు కూడా కలలో ఊహించి ఉండకపోవచ్చన్నారు. మన త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చామని.. దీంతో ఆపరేషన్ సిందూర్ ద్వారా ప్రపంచం చూడని విధంగా అద్భుతాలు సృష్టించారని ప్రశంసించారు.

ఇది కూడా చదవండి: YSR-Kadapa District: మరోసారి మారిన కడప జిల్లా పేరు.. ఉత్తర్వులు జారీ..

భారతదేశం పట్ల దాయాది దేశం పట్ల ద్వేషం కక్కుతోందని.. భారత్‌కు హాని చేయాలనే పాకిస్థాన్ కోరుకుంటోందని తెలిపారు. భారత్ లక్ష్యం పేదరిక నిర్మూలన, ఆర్థికాభివృద్ధిని పెంపొందించడం, అభివృద్ధిని చెందిన దేశంగా మార్చడమే లక్ష్యమని చెప్పారు. ఇక వెనుకబడిన ప్రాంతాలకు అభివృద్ధిని తీసుకెళ్లడమే ప్రభుత్వ విధానమని చెప్పారు. హోలీ, దీపావళి, గణేష్ పూజ వంటి పండుగల సమయంలో భారతదేశంలో తయారైన ఉత్పత్తులను కొనుగోలు చేసి ఉపయోగించాలని ప్రజలను మోడీ కోరారు. విదేశీ దిగుమతులను కొనుగోలు చేయడం మంచిది కాదని చెప్పారు. ప్రతి ఒక్కరూ స్వదేశంలో తయారైన వస్తువులనే కొనుగోలు చేసేందుకు సంకల్పించుకోవాలని కోరారు.

ఇది కూడా చదవండి: Viva Harsha : లగ్జరీ కారు కొన్న వైవా హర్ష.. ఎన్ని కోట్లో తెలుసా..?

ఇక అంతకముందు వడోదర విమానాశ్రయం నుంచి నగర శివార్లలోని వైమానిక దళ స్టేషన్ వరకు మోడీ రోడ్ నిర్వహించారు. స్వాగతం పలికిన జనంలో కల్నల్ ఖురేషి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు.

ఏప్రిల్ 22న పహల్గామ్‌ ఉగ్రదాడిలో 26 మంది చనిపోయారు. దీనికి ప్రతీకారంగా భారత్.. ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. దాదాపు 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అంతేకాకుండా పాకిస్థాన్‌‌లో పలు చోట్ల వైమానిక స్థావరాలు నాశనం అయ్యాయి. అయితే పాకిస్థాన్ కాళ్ల బేరానికి రావడంతో భారత్ కాల్పుల విరమణకు అంగీకరించింది.

Exit mobile version