PM Modi: సభలో భావోద్వేగం… చిన్నారి చూపిన అమ్మ ఫోటోతో మోడీ కంటతడి!
- బెంగాల్ సభలో ప్రధాని మోడీ భావోద్వేగం..
- చిన్నారి తెచ్చిన ఫోటో చూసి కంటతడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు మరికొన్ని రోజులు సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఆదివారం రోజు ప్రధాని నరేంద్రమోడీ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆయన పురూలియాలో జరిగిన భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. తన ప్రసంగాన్ని మధ్యలో ఆపేసి, చిన్నారితో మాట్లాడారు. తన ప్రసంగం మధ్యలో చిరాగ్ అనే చిన్నారిని చూసి అకస్మాత్తుగా భావోద్వేగానికి లోనయ్యారు. వెంటనే ఆయన మాట్లాడటం ఆపేశారు.
Read Also: Ali Khamenei: ఇరాన్‌లో భయం ఇంకా తగ్గలేదు… ఖమేనీ అంత్యక్రియలు నెలరోజులుగా వాయిదా!
Also Read
- Dehradun: నేలరాలిన విద్యాకుసుమం.. 12వ తరగతి టాపర్ ఆత్మహత్య
- Mumbai: కనిపించని రుతుపవనాల జాడ.. ముంబైలో నీటి సరఫరాపై ఆంక్షలు.. జరిమానా
- Telegram Banned: నీట్ రీ-ఎగ్జామ్ వరకు టెలిగ్రామ్ బ్యాన్.. స్పందించిన సీఈఓ పావెల్ దురోవ్..
- Twisha Sharma: ‘అవి మాకు పూర్తిగా కావాలి’.. కోర్టులో ట్విషా శర్మ అత్తగారు వింత వాదన
చిన్నారి ప్రధాని మోడీ, ఆయన తల్లి ఉన్న ఫోటోను ప్రదర్శించాడు. ఇది చూసిన ఆయన తన వద్దకు ఫోటో తీసుకుమ్మని తన భద్రతా సిబ్బందిని ఆదేశించారు. తన తల్లి ఫోటోను చూడగానే భావోద్వేగానికి గురయ్యారు. ‘‘మా అమ్మ ఫోటో తెచ్చినందుకు చాలా ధన్యవాదాలు. నన్ను భావోద్వేగానికి గురిచేశావు’’ అని అన్నారు. ప్రధాని తమతో మాట్లాడినందుకు చాలా సంతోషంగా ఉందని చిరాగ్, అతడి తల్లి చెప్పారు. ప్రధాని మోడీ తనకు లేఖ రాస్తానని చెప్పినట్లు చిరాగ్ తెలిపారు.
పశ్చిమ బెంగాల్‌లోని 294 స్థానాలకు రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. 152 స్థానాలకు ఏప్రిల్ 23, 2026న, 142 స్థానాలకు ఏప్రిల్ 29, 2026న పోలింగ్ జరుగుతుంది. ఎన్నికల ఫలితాలను మే 4, 2026న ప్రకటిస్తారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, టీఎంసీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ అనుకుంటోంది. మరోవైపు, తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని టీఎంసీ ప్రచారం చేస్తోంది.
తాజావార్తలు
-
Off The Record: మెట్రో కేంద్రంగా కాంగ్రెస్, బీజేపీ పొలిటికల్ వార్..
-
Honeymoon Mystery: హనీమూన్ మిస్టరీ.. ముస్సోరీలో విశాఖ మహిళ మృతి..
-
Dehradun: నేలరాలిన విద్యాకుసుమం.. 12వ తరగతి టాపర్ ఆత్మహత్య
-
Off The Record: గాంధీ భవన్‌ను తాకుతున్న పాత-కొత్త గొడవలు..
-
Mumbai: కనిపించని రుతుపవనాల జాడ.. ముంబైలో నీటి సరఫరాపై ఆంక్షలు.. జరిమానా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్‌లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?