Site icon NTV Telugu

PM Modi: సీపీ.రాధాకృష్ణన్ ప్రజా సేవకే జీవితం అంకితం చేశారు.. చైర్మన్‌ను అభినందించిన మోడీ

Pmmodi

Pmmodi

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఇక రాజ్యసభకు తొలిసారి సీపీ రాధాకృష్ణన్ అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా అన్ని పార్టీలు ఆయన్ను అభినందించాయి. ఇక ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ఇటీవల వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా మహిళలకు మోడీ అభినందనలు తెలిపారు. ‘‘పెద్దల సభా గౌరవాన్ని సభ్యులు గౌరవించాలి. సీపీ.రాధాకృష్ణన్ సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చారు. రాధాకృష్ణన్ ప్రజా సేవకే తన జీవితాన్ని అంకితం చేశారు. తెలంగాణ, మహారాష్ట్ర, జార్ఖండ్ గవర్నర్‌గా పని చేశారు. అర్థవంతమైన చర్చలు జరిగితే సభకు సార్థకత వస్తుంది.’’ అని మోడీ తెలిపారు.

ఇది కూడా చదవండి: Trump-Maduro: వెనిజులా అధ్యక్షుడితో ట్రంప్ సంభాషణ.. మేటర్ సీరియస్ అవుతోందా?

గత వర్షాకాల సమావేశాల ప్రారంభం రోజున అనూహ్యంగా ఉపరాష్ట్రపతిగా ఉన్న జగదీప్ ధన్‌ఖర్ రాజీనామా చేశారు. దీంతో ఆయన వారసుడిగా మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న సీసీ.రాధాకృష్ణన్‌ను ఉపరాష్ట్రపతిగా కేంద్రం ఎన్నిక చేసింది. తాజాగా పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభం రోజున రాజ్యసభ ఛైర్మన్‌గా రాధాకృష్ణన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా అందరూ ఆయన్ను అభినందించారు.

ఇది కూడా చదవండి: Gold Rates: పసిడి పరుగులు.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!

ఇదిలా ఉంటే పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు మోడీ మీడియాతో మాట్లాడారు.
‘‘ఓటమి నిరాశకు పార్లమెంట్ యుద్ధభూమి కాదు’’ అని పేర్కొన్నారు. సమావేశాలు ప్రారంభం అవుతున్న తరుణంలో ప్రధాని మోడీ కీలక ఉపాన్యాసం చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీలు సహకరించాలని కోరారు. ఓటమి నిరాశకు యుద్ధభూమి కాదని.. మనం సమతుల్యతను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య దేశంలో అందరి అభిప్రాయాలు తెలుసుకోవాలని.. చట్టసభల్లో సమయానికి చర్చలు తప్పనిసరి అని తెలిపారు. దేశ ప్రగతి కోసం పార్లమెంట్‌లో మంచి చర్చలు కొనసాగాలని ఆకాంక్షించారు. వికసిత్‌ భారత్‌ లక్ష్యం సాధించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. దేశాభివృద్ధి కోసం విపక్షాలు కూడా తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు.

Exit mobile version