పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఇక రాజ్యసభకు తొలిసారి సీపీ రాధాకృష్ణన్ అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా అన్ని పార్టీలు ఆయన్ను అభినందించాయి. ఇక ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ..
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం అవుతున్న తరుణంలో ప్రధాని మోడీ ప్రతిపక్ష పార్టీలకు కీలక పిలుపునిచ్చారు. ‘‘ఓటమి నిరాశకు పార్లమెంట్ యుద్ధభూమి కాదు’’ అని పేర్కొన్నారు.
నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఉదయం 11 గంటలకు పార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. శీతాకాల సమావేశాలు కూడా హాట్‌హాట్‌గా సాగేటట్టు కనిపిస్తున్నాయి. గత వర్షాకాల సమావేశాలు కూడా వాడివేడీగా జరిగాయి.