PhonePe: సీఎంపై కాంగ్రెస్ పోస్టర్లు.. లీగల్ యాక్షన్ తీసుకుంటామన్న ఫోన్ పే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PhonePe: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య ఇప్పుడే ప్రచారం ఊపందుకుంది. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ గతంలో కర్ణాటక ఎన్నికల్లో అవలంభించిన స్ట్రాటజీనే వాడుతోంది. మధ్యప్రదేశ్ లో కూడా సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ కమిషన్లు తీసుకుంటున్నారని ఆరోపిస్తూ పోస్టర్లు వేశారు. అయితే ఇది కాంగ్రెస్ పార్టీకే ఎదురుతిరిగింది. ఈ పోస్టర్ల కోసం కాంగ్రెస్ ప్రముఖ ఫిన్‌టెక్ సేవల సంస్థ ‘ఫోన్ పే’ లోగోను వాడింది. దీంతో వివాదం మొదలైంది.
ఫోన్ పే లోగో, క్యూఆర్ కోడ్స్ ఉంటున్నాయి. వీటిపై ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఫోటోలను ముద్రించింది కాంగ్రెస్ పార్టీ. ఈ చిత్రాలను ట్విట్టర్ ద్వారా పంచుకుంటూ.. రాష్ట్రంలో పని జరగాలంటే 50 శాతం కమీషన్ ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొందని విమర్శలు గుప్పించింది. ఇటువంటి పోస్టర్లు చింద్వారా, రేవా, సత్నా మరియు రాష్ట్ర రాజధాని నగరం భోపాల్‌లో కూడా కనిపించాయి. ఆ తరువాత అధికారులు వీటిని తొలగించారు.
Also Read
- Nepal: నేపాల్ భారత భూభాగాలను ఆక్రమించుకుంది.. బాలెన్ షా సంచలన వ్యాఖ్యలు..
- Indian Railways: రేపటి నుంచి రైల్వే కొత్త రూల్స్.. వెయిటింగ్ టికెట్లు, అడ్వాన్స్ బుకింగ్‌లలో కీలక మార్పులు
- UP Encounter: సూర్య హత్య, అసద్ ఎన్కౌంటర్.. యోగి సర్కార్‌పై ఎస్పీ విమర్శలు..
- West Bengal: మమతకు భారీ షాక్.. 80 మందిలో 20 మంది ఎమ్మెల్యేలే హాజరు!
Read Also: CARE Hospitals : కేర్ ఆస్పత్రిలో విజయవంతంగా క్వాడ్రాఫుల్ కరోనరీ బైపాస్ సర్జరీ
అయితే దీనిపై ఫోన్ పే ఘాటుగానే స్పందించింది. మా బ్రాండ్ లోగోను దుర్వినియోగం చేస్తున్నారు.. దీన్ని వ్యతిరేకిస్తున్నామని, మాకు ఏ రాజకీయ పార్టీలో సంబంధం లేదని, దీనిపై చట్టపరమైన చర్యయలు తీసుకుంటామని హెచ్చరించింది. మా బ్రాండ్ లోగో మరియు రంగును కలిగి ఉన్న పోస్టర్లు మరియు బ్యానర్లను తీసివేయమని మేము మధ్యప్రదేశ్ కాంగ్రెస్‌ని వినమ్రంగా అభ్యర్థిస్తున్నామని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.
ఈలోగా, పోస్టర్లు అతికించిన గుర్తు తెలియని వ్యక్తులపై పడవ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది మరియు పోలీసులు వారి కోసం వెతుకుతున్నారు. తన పార్టీ పరువు తీస్తున్నారని బీజేపీ కార్యకర్త ఫిర్యాదు చేశారని, దాని ఆధారంగా గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని గ్వాలియర్ ఎస్పీ రాజేష్ సింగ్ చందేల్ తెలిపారు.
తాజావార్తలు
-
RCB Champion: ఐపీఎల్ ఫైనల్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం.. రెండో సారి కప్ అందుకున్న RCB..
-
Vaibhav Sooryavanshi: కోహ్లీ, గిల్, యశస్వి జైస్వాల్‌ను వెనక్కి నెట్టిన వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల వయస్సులోనే అరుదైన రికార్డు..
-
Virat Kohli: ఆకాశమే హద్దుగా చెలరేగిన విరాట్ కోహ్లీ.. 19 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో అరుదైన రికార్డు సాధించిన కింగ్..
-
GT Vs RCB: వార్ వన్ సైడ్ అయిపోయింది.. ఫైనల్ మజా రావడం లేదు.. నిరాశలో అభిమానులు..
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
ట్రెండింగ్
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!