పొగరాయుళ్లు ఎక్కడ పడితే అక్కడ.. అలా ఓ సిగరేట్ తీసుకుని.. స్టైల్‌గా దమ్ముకొడుతున్నారా? ఇక, మీకు షాక్ తప్పదు.. ఎందుకంటే, సిగరెట్లు లూజ్ సేలింగ్ బ్యాన్ చేసే విధంగా కేంద్రం సిద్ధం అవుతోంది.. కొన్ని నివేదికల ప్రకారం.. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని అరికట్టేలా సింగిల్ సిగరెట్ల అమ్మకాల్ని బ్యాన్ చేయాలని సలహా ఇచ్చినట్లు సమాచారం.. లూజ్ సిగరెట్ల అమ్మకాలు పొగాకు నియంత్రణపై చేస్తున్న ప్రచారాన్ని ప్రభావితం చేస్తున్నాయని కమిటీ సభ్యుల వాదనగా ఉంది.. దీంతో పాటు దేశంలోని అన్ని ఎయిర్‌పోర్ట్‌ల్లో స్మోకింగ్ జోన్లను తొలగించాలని కూడా కమిటీ సిఫార్స్ చేయడంతో.. పొరగాయుళ్లకు షాక్ తప్పదని నివేదికలు చెబుతున్నాయి.
Read Also: Nama Nageswara Rao : దేశంలో ఏ ప్రభుత్వం చేయని పనులు రాష్ట్రంలో చేశాం
నివేదికల ప్రకారం, పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించేందుకు సింగిల్ సిగరెట్ల విక్రయంపై పరిమితి విధించాలని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సిఫార్సు చేసింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ సలహా మేరకు కేంద్ర ప్రభుత్వం మూడేళ్ల క్రితం ఈ-సిగరెట్ల అమ్మకాలు మరియు వినియోగాన్ని నిషేధించిందని గుర్తు చేశారు. పార్లమెంటు స్టాండింగ్ కమిటీ ప్రకారం సింగిల్ సిగరెట్ల అమ్మకం పొగాకు వినియోగానికి వ్యతిరేకంగా పోరాటంపై ప్రభావం చూపుతోందని పేర్కొంది.. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సిఫారసులకు అనుగుణంగా భారత ప్రభుత్వం పొగాకు వస్తువులపై 75 శాతం జీఎస్టీని అమలు చేయాలి. దేశం ఇటీవలి పన్ను స్లాబ్‌ల ప్రకారం బీడీలపై 22 శాతం, సిగరెట్లపై 53 శాతం జీఎస్టీ మరియు పొగలేని పొగాకుపై 64 శాతం జీఎస్టీ విధిస్తోంది.. జీఎస్టీ అమల్లోకి వచ్చినా పొగాకు వస్తువులపై పన్ను పెద్దగా పెరగలేదని స్టాండింగ్ కమిటీ గుర్తించింది. పొగాకు మరియు ఆల్కహాల్ వాడటం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయని కమిటీ నొక్కి చెప్పింది. భారతదేశంలో ఇప్పటికే బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధించబడింది. చట్టాన్ని ఉల్లంఘించినందుకు రూ.200 వరకు జరిమానా విధించవచ్చు. పొగాకు ఉత్పత్తుల ప్రకటనలను కూడా ప్రభుత్వం నిషేధించింది.
మరోవైపు.. కొన్ని నివేదికల ప్రకారం, మన దేశంలో స్మోకింగ్ కారణంగా ఏడాదికి 3.5 లక్షల మంది మృత్యువాత పడినట్లు పేర్కొంది.. 2018లో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ నిర్వహిం చిన ఒక సర్వే లో ధూమపానం చేసే వారిలో 46 శాతం మంది నిరక్షరాస్యులుగా, 16 శాతం మంది కాలేజీ విద్యార్ధులుగా పేర్కొంది.. భారత్‌లో ఏడాదికి దాదాపు 6.6 కోట్ల మంది సిగరెట్లు తాగుతుండగా, 26 కోట్లకు పైగా ఇతర పొగాకు ఉత్పత్తులను వినియోగిస్తున్నారు.. పొగాకు వాడకం వల్ల దేశవ్యాప్తంగా దాదాపు 21 శాతం మందికి క్యాన్సర్ బారినపడినట్టు ఓ అధ‍్యయనంలో బయటపడింది.. మరి, ఇప్పుడు కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి.