Petrol, Diesel Price Hike: మళ్ళీ భారీగా పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా సామాన్య, మధ్యతరగతి ప్రజలకు చమురు సంస్థలు కోలుకోలేని షాక్ ఇచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్ ఒడిదొడుకుల నెపంతో సామాన్యుడి నడ్డి విరిచేలా ఇంధన ధరలను మరోసారి భారీగా పెంచేశాయి. గత పది రోజుల వ్యవధిలోనే ధరలు పెరగడం ఇది నాలుగో సారి కావడం గమనార్హం. వరుస పెంపులతో ఇప్పటికే ఇబ్బంది పడుతున్న వాహనదారులపై ఈ తాజా నిర్ణయం మరింత భారంగా మారనుంది. చమురు మార్కెటింగ్ కంపెనీలు శరవేగంగా రేట్లను సవరిస్తూ ఈ తాజా వాత పెట్టాయి. ఈ రోజు ప్రకటించిన సవరణల ప్రకారం లీటర్ పెట్రోల్‌పై ₹2.84 పెంపు, లీటర్ డీజిల్‌పై ₹2.86 పెంపు ఉంది. పెరిగిన ఈ భారీ ధరలు ఈరోజు ఉదయం 6 గంటల నుంచే దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చేశాయి. దీంతో ఉదయాన్నే బంకులకు వెళ్లిన వాహనదారులకు రేట్లను చూసి ఫ్యూజులు అవుట్ అయ్యాయి.
ఒకేసారి ఐదు లేదా ఆరు రూపాయలు పెంచితే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతోనే, చమురు సంస్థలు విడతల వారీగా రేట్లు పెంచుకుంటూ పోతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత పది రోజుల్లోనే నాలుగు సార్లు రేట్లు మార్చడం దీనికి నిదర్శనం. ప్రతి రెండు, మూడు రోజులకు ఒకసారి పైసల్లో కాకుండా.. ఏకంగా రెండు రూపాయలకు పైగా పెంచేస్తూ పోతుండటంతో లీటర్ ఇంధనం ధరలు సరికొత్త రికార్డుల వైపు దూసుకుపోతున్నాయి. కేవలం పెట్రోల్, డీజిల్ ధరల పెంపు వాహనదారులకే పరిమితం కాదు. దీని ప్రభావం చైన్ రియాక్షన్ లా అన్ని వర్గాలపై పడనుంది. రవాణా భారం పెరిగితే ఆటోమేటిక్‌గా మార్కెట్‌కు వచ్చే కూరగాయలు, పప్పులు, పాలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరగక తప్పదు.
Also Read
- Gyanesh Kumar: ప్రతిపక్షాల విమర్శల మధ్య CEC జ్ఞానేష్ కుమార్.. ఆయన ఎవరు, నేపథ్యం ఏమిటి?
- Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
- Bihar: లైంగిక కేసు నిందితుడి చెంప పగలగొట్టిన న్యాయవాది
- B.Tech Degree: ఇక నుంచి బీటెక్ 5 సంవత్సరాలు.. ప్రతిపాదించిన ఢిల్లీ ఐఐటీ మాజీ డైరెక్టర్..
తాజావార్తలు
-
OTR: టీడీపీ ఎమ్మెల్యేకు నిద్ర పట్టడం లేదా..? ఎందుకంత కష్టమొచ్చింది..?
-
Gautam Gambhir: సంజు శాంసన్ విషయంలో తప్పు చేశా.. ఆ రాత్రి నాకు నిద్ర కూడా పట్టలేదు..
-
AP Heavy Rain Alert: తీరంవైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. దంచికొడుతున్న వానలు..
-
Gyanesh Kumar: ప్రతిపక్షాల విమర్శల మధ్య CEC జ్ఞానేష్ కుమార్.. ఆయన ఎవరు, నేపథ్యం ఏమిటి?
-
Pezeshkian: ‘మేము ఉగ్రవాదులం కాదు.. బాధితులం’.. యూఎన్‌లో ఫొటోలు చూపించి ఇరాన్ అధ్యక్షుడు ప్రసంగం
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!