Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం కీలక ప్రకటన..
- పెట్రోల్-డీజిల్ ధరల పెంపుపై కేంద్రం క్లారిటీ..
- ఎన్నికల తర్వాత పెంచే ఆలోచన లేదని స్పష్టత..
- ధరలు పెరుగుతాయనే వదంతులు నమ్మెద్దని కోరిన కేంద్రం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Petrol-Diesel Price: అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయంటూ ప్రజల్లో ఆందోళనలు పెరుగుతున్నాయి. దీంతో చాలా ప్రాంతాల్లో ప్యానిక్ కొనుగోళ్లు మొదలయ్యాయి. దీంతో బంకుల ముందు వాహనాలు కిలోమీటర్ల మేర క్యూ కట్టాయి. ఇదిలా ఉంటే, పెట్రోల్-డీజిల్ ధరల పెంపుపై కేంద్రం మంగళవారం కీలక ప్రకటన చేసింది. పశ్చిమ ఆసియాలోని పరిణామాలపై జరిగిన విలేకరుల సమావేశంలో పెట్రోలియం మరియు సహజ వాయువుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ, “పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే ప్రతిపాదన ఏదీ లేదు” అని స్పష్టతనిచ్చారు.
Read Also: Womens T20 World Cup 2026: ప్రపంచ కప్ కు జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్.. టీంలో ఎవరెవరు ఉన్నారంటే.?
Also Read
- Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
- Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
- Karnataka: కర్ణాటక కాంగ్రెస్‌లో షాక్.. అవినీతి ఆరోపణలు.. కీలక మంత్రి రాజీనామా..
- Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
ఆంధ్రప్రదేశ్‌లో గత రెండు రోజుల నుంచి పానిక్ కొనుగోళ్లు పెరగడంతో వీటిని అదుపు చేసే క్రమంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. వదంతులు నమ్మవద్దని సుజాత శర్మ ప్రజల్ని కోరారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత పెట్రోల్, డీజిల్ ధరల్ని పెంచే యోచన లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏప్రిల్ 29న పశ్చిమ బెంగాల్ పోలింగ్ ముగిసిన వెంటనే ఇంధన ధరలు పెరుగుతాయన్న ఊహాగానాలను పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ మంగళవారం ఖచ్చితంగా తోసిపుచ్చింది. ఇరాన్ యుద్ధం, మిడిల్ ఈస్ట్ సంక్షోభం నేపత్యంలో గత రెండు నెలల్లో ముడి చమురు ధర 50 శాతానికి పైగా పెరిగి, ప్రభుత్వ రంగ చమురు కంపెనీలపై భారీ ఆర్థిక ఒత్తిడి పడుతున్న తరుణంలో కేంద్రం నుంచి ఈ ప్రకటన వచ్చింది.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!