Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
- అంతర్జాతీయంగా తగ్గుతున్న ముడి చమురు ధరలు
- పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?
- కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు భారీ నష్టాలను చవిచూశాయని కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ తెలిపారు. ఏప్రిల్ నుంచి జూన్ 30 వరకు పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ విక్రయాలపై మొత్తం రూ.74,781 కోట్ల నష్టం వాటిల్లినట్లు వెల్లడించారు. అయితే ఏప్రిల్-జూన్ మధ్య పెట్రోల్‌పై రూ.19,905 కోట్ల, డీజిల్‌పై రూ.1.44 లక్షల కోట్ల, ఎల్పీజీపై రూ.24,148 కోట్ల అండర్ రికవరీ నమోదైందని… ఈ మూడు కలిపి మొత్తం రూ.1.88 లక్షల కోట్ల అండర్ రికవరీగా ఉందని చెప్పారు. గత ఏడాది ఎల్పీజీపై వచ్చిన నష్టాలను కలిపితే మొత్తం అండర్ రికవరీ రూ.2.1 లక్షల కోట్లకు చేరిందని పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాలో అంతరాయాలు ఏర్పడినప్పటికీ.. భారత్‌లో ఇంధన సరఫరాకు ఎలాంటి ఆటంకం కలగలేదని స్పష్టం చేశారు. ముడి చమురు, డీజిల్, ఎల్పీజీ నిల్వలను ముందుగానే విభిన్న దేశాల నుంచి సమీకరించడం వల్ల సరఫరా నిరంతరంగా కొనసాగిందని తెలిపారు.
Also Read
- Youtube Videos: రీల్స్, యూట్యూబ్ వీడియోలు చేస్తే లక్ష రూపాయలు... క్రియేటర్లకు పండగలాంటి వార్త చెప్పిన ప్రభుత్వం..
- IT Raids: హైదరాబాద్ టు హాంగ్‌కాంగ్.. ఐటీ దాడుల్లో రూ.1000 కోట్ల హవా లావాదేవీల గుట్టురట్టు..
- Heavy Rain Alert: ఆగస్టు 24 వరకు భారీ వర్షాలు.. హిమాలయాల నుంచి మధ్య భారతం వరకు హై అలర్ట్!
- India-Pakistan Tensions: పాక్ హైకమిషన్ వద్ద భద్రతా బారికేడ్లు తొలగించిన భారత్.. J&K వ్యాఖ్యల వేళ కీలక పరిణామం
ధరల తగ్గింపుపై..
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశంపై స్పందించారు.. ప్రస్తుతం దేశంలో శుద్ధి చేస్తున్న ముడి చమురు రెండు నెలల క్రితమే అధిక ధరలకు కొనుగోలు చేసినదేనని చెప్పారు. అప్పటి అంతర్జాతీయ చమురు ధరలు, రవాణా వ్యయాలు ఎక్కువగా ఉండటంతో ప్రస్తుతం వాటి ప్రభావం కొనసాగుతోందన్నారు. భవిష్యత్తులో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తక్కువగానే కొనసాగితే దేశీయంగా కూడా ధరలపై సానుకూల ప్రభావం కనిపించే అవకాశం ఉందని తెలిపారు.
భారత్ ఇంధన దిగుమతుల వ్యూహాన్ని మరింత విస్తరించిందని వెల్లడించారు. గతంలో వాణిజ్య సంబంధాలు లేని దేశాల నుంచి కూడా చమురు, ఎల్పీజీ దిగుమతులు ప్రారంభించినట్లు చెప్పారు. అమెరికా నుంచి భారీ ఎత్తున ఎల్పీజీ కార్గోలను తెచ్చుకున్నామని.. వెనిజులా నుంచి కూడా ముడి చమురు కొనుగోలు ప్రారంభించామని తెలిపారు. భారత రిఫైనరీలు వివిధ రకాల ముడి చమురును శుద్ధి చేసే సామర్థ్యం కలిగి ఉండటమే ఇందుకు కారణమని వివరించారు.
భవిష్యత్తులో అంతర్జాతీయ చమురు ధరల్లో మరోసారి భారీ హెచ్చుతగ్గులు వచ్చినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని హర్దీప్ సింగ్ పూరీ చెప్పారు. చమురు నిల్వ సామర్థ్యాన్ని పెంచడం, ద్వైపాక్షిక భాగస్వామ్య దేశాలతో ఇంధన ఒప్పందాలను బలోపేతం చేయడం వంటి చర్యలను ప్రభుత్వం కొనసాగిస్తోందని తెలిపారు.
తాజావార్తలు
-
YS Jagan: డీఎస్సీ అక్రమాలకు అక్కడే బీజం పడింది.. సీబీఐ విచారణ జరపాలి.. లోకేష్ రాజీనామా చేయాలి!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Sai Abhyankkar: ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ పేరుతోనే పాట.. సాయి అభ్యంకర్ ‘రాధిమా’ వెనుక అసలు కథ ఇదే!
-
Youtube Videos: రీల్స్, యూట్యూబ్ వీడియోలు చేస్తే లక్ష రూపాయలు… క్రియేటర్లకు పండగలాంటి వార్త చెప్పిన ప్రభుత్వం..
-
Volvo EX90: LiDAR సేఫ్టీతో వస్తున్న లగ్జరీ ఎలక్ట్రిక్ SUV వోల్వో EX90.. 600KM రేంజ్..!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!