Petrol Dealer Association: మే 31 నుంచి పెట్రోల్, డిజిల్ కొనం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెట్రోల్ పంప్స్ డీలర్స్ అసోసియేషన్ కీలక ప్రకటన చేసింది. మే 31న 24 రాష్ట్రాల్లోని 70,000 ఔట్‌లెట్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల నుంచి ఇంధనం కొనుగోలు చేయడం లేదని పెట్రోల్ పంప్ డీలర్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ మేరకు ఢిల్లీలో సోమవారం సమావేశం అయిన డీలర్ అసోసియేషన్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. చమురు కంపెనీల నుంచి ఇంధనం కొనుగోలు చేయవద్దని ప్రతినిధులు చర్చించారు. అయితే గత 5 ఏళ్లుగా డీలర్ మార్జిన్లు పెంచలేదని.. ప్రభుత్వం చేసిన ఎక్సైజ్ డ్యూటీ సవరణల వల్ల నష్టాలపై చర్చించారు.
గత ఐదేళ్లుగా చమురు కంపెనీలు డీలర్ మార్జిన్ లను పెంచనప్పటీకీ, పెట్రోల్ పంపుల యాజమాన్యం, నిర్వహణ ఖర్చులు పెరిగాయని అసోసియేషన్ తెలిపింది. కేంద్ర ప్రభుత్వం చివరి సారిగా 2017లో డీలర్ మార్జిన్ లను పెంంచిందని.. ఆ తరువాత చమురు కంపెనీలు, డీలర్ అసోసియేషన్లు 6 నెలల వారీగా డీలర్ మార్జిన్ సవరణ ఉంటుందని అంగీకరించినప్పటికీ దానిని కంపెనీలు అనుసరించలేదని డీలర్ అసోసియేషన్ ఆరోపించింది. డీలర్ మార్జిన్ 5 శాతానికి పెంచాలని డిమాండ్ చేస్తోంది డీలర్ అసోసియేషన్.
Also Read
- Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్‌రేప్
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- INS Nipun: భారత నౌకాదళంలోకి స్వదేశీ డైవింగ్ షిప్.. 300 మీటర్ల లోతు వరకు ఆపరేషన్స్
- Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
ఖర్చులు పెరిగినప్పటికీ 2017 నుంచి డీలర్ మార్జిన్ 2 శాతం నుంచి పెంచలేదని.. దీంతో జీతాలు, విద్యుత్ బిల్లులు, బ్యాంకు ఛార్జీలు మొదలైన ఖర్చులు పెరిగాయని డీలర్ అసోసియేషన్ చెబుతోంది. అధిక ఖర్చుల వల్ల చిన్న పంపులను దివాాలా అంచుకు నెట్టేశాయని అసోసియేషన్ అంటోంది. ఎక్సైజ్ తగ్గింపు వల్ల కలిగిన డీలర్ నష్టాలను తిరిగి చమురు సంస్థలు చెల్లించాలని డిమాండ్ చేసింది. ఎక్సైజ్ తగ్గింపు వల్ల తమపై విపరీతమైన భారం పడిందని.. ఎక్కువ ధరకు చమురును కొనుగోలు చేసిన తర్వాత తక్కువ ధరకు విక్రయించడం వల్ల లక్షల్లో నష్టాలు వాటిల్లాయని డీలర్ అసోసియేషన్ అంది.
తాజావార్తలు
-
Ponnam Prabhakar : బీఆర్ఎస్ నిరసనలపై పొన్నం ఫైర్.. ‘లెక్కలు చెప్పండి’ అంటూ వార్నింగ్..
-
Tummala Nageswara Rao : పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు
-
Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్‌రేప్
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!