Tamil Nadu Deepam Row: తమిళనాడు దీపం వివాదం.. “దర్గా” వద్ద జంతుబలి ఆపాలని పిటిషన్..
- మరోసారి వార్తల్లోకి తిరుపరంకుండ్రం..
- దర్గా వద్ద ‘జంతుబలి’ని ఆపాలని పిటిషన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu Deepam Row: తమిళనాడులోని తిరుపరంకుండ్రం సుబ్రమణ్యస్వామి ఆలయంలో దీపం వెలిగింపు వివాదం, ఆ రాష్ట్రంలో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మద్రాస్ హైకోర్టు కొండపై ఉన్న ఆలయం వద్ద దీప వెలిగించాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ, ప్రభుత్వం దానిని పట్టించుకోలేదు. దీంతో భక్తులు బలవంతంగా కొండపైకి వెళ్లి దీపాన్ని వెలిగించే ప్రయత్నం చేయడంతో పెద్ద ఎత్తున హింస చెలరేగింది.
ఇదిలా ఉంటే, ఈ వివానానికి కారణంగా ఉన్న దర్గాపై మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దర్గాలో ‘కంతురి’ ఉత్సవాన్ని అనుమతించవద్దని కోరుతూ మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్‌లో ఒక రిట్ పిటిషన్ దాఖలైంది. ఇదే దర్గాకు సమీపంలో ఉన్న సుబ్రమణ్యస్వామి ఆలయం వద్ద దీపం వెలిగించడానికి మద్రాస్ హైకోర్టు తీర్పు చెప్పింది. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు కొండపై జంతుబలిని నిషేధిస్తున్నాయని పిటిషనర్ వాదించారు. ఈ ఉత్సవాన్ని అనుమతిస్తే హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని పిటిషనర్ పేర్కొన్నారు.
Also Read
- National Doctors Day 2026: మద్యం, ఒత్తిడి, మధుమేహం.. ప్రజల్లో ఉన్న అపోహలపై వైద్యుల క్లారిటీ
- Delhi EV Policy 2026: ఢిల్లీలో ఈవీ విప్లవం.. మరి పెట్రోల్, డీజిల్ వాహనాల భవిష్యత్ ఏంటి?
- Pawan Kalyan Meets Devendra Fadnavis: పవన్ – ఫడ్నవీస్ భేటీ.. పులుల సంరక్షణపై కీలక నిర్ణయం
- Home Delivery Tragedy: యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లో ప్రసవం.. భర్తపై కేసు..!
విజయనగర పాలకుడు కుమార కంపనపై మధురై నగరం కోసం పోరాడుతూ మరణించిన సుఫీ సాధువు సుల్తాన్ సికిందర్ బాదుషా సమాధి ఈ దర్గాలో ఉంది. ఈ దర్గా నిర్వాహకులు గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేయలేదని, ఉత్సవాన్ని నిర్వహించుకునే హక్కుల కోసం సివిల్ కోర్టును ఆశ్రయించలేదని పిటిషన్ కోర్టుకు తెలిపారు. తాత్కాలిక ఉపశమనం కోరుతూ, రిట్ పిటిషన్ పరిష్కారమయ్యే వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని పిటిషనర్ కోర్టును కోరారు. అయితే, జస్టిస్ జ్యోతి రమణ ఈ అభ్యర్థనను తిరస్కరించి, దర్గా నిర్వాహకులకు నోటీసు జారీ చేస్తూ, కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించారు. ఈ కేసు జనవరి 2కు వాయిదా పడింది.
ఆదివారం దర్గాలో సంతనకూడు ఉత్సవానికి సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభమైన తర్వాత ఈ పిటిషన్ వచ్చింది. ఈ కార్యక్రమం జరుగుతున్నప్పుడే కొంత మంది స్థానికులు కొండపైకి ఎక్కి దీపం వెలిగించడానికి అనుమతి ఇవ్వాలని నిరసన తెలిపారు. పోలీసులు జోక్యం చేసుకుని, దర్గా వద్ద వేడుకలకు సంబంధించి ఏర్పాట్లకు మాత్రమే అనుమతి మంజూరు చేసినట్లు చెప్పారు. అయితే, హిందువుల హక్కుల్ని డీఎంకే అణిచివేస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది.
తాజావార్తలు
-
RRB Technician Recruitment 2026: రైల్వేలో 6,557 ఉద్యోగాలు.. నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభం, పూర్తి వివరాలు ఇవే
-
National Doctors Day 2026: మద్యం, ఒత్తిడి, మధుమేహం.. ప్రజల్లో ఉన్న అపోహలపై వైద్యుల క్లారిటీ
-
LA 2028 Olympics: ఒలింపిక్స్‌లో భారత్-పాక్ హైవోల్టేజ్ మ్యాచ్ ఉంటుందా? క్లారిటీ ఇదిగో..
-
Samudra: ఆ వసూళ్లతో నాకేం సంబంధం లేదు.. ఎవరైనా నా పేరు వాడితే ఊరుకోను
-
Sudha Kongara: ఆ సినిమా రిలీజ్ ఆపండి.. కోర్టుకెక్కిన సుధా కొంగర!
ట్రెండింగ్
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్‌లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!