Pet Dog Tax: మీరు కుక్కలను పెంచుకుంటున్నారా..? అయితే మీ జేబు చిల్లు పడడం ఖాయం.. ఎందుకు అంటున్నారా? మీకు పన్ను బాదుడు తప్పదు.. భద్రత, పరిశుభ్రత పన్ను పేరుతో కొత్త పనులు వసూలు చేయనున్నారు.. ఇది ప్రస్తుతానికి మధ్యప్రదేశ్‌లోని ఓ మున్సిపల్ కార్పొరేషన్‌కు పరిమితం అయ్యింది.. రానురాను అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, కార్పొరేషన్లు.. పట్టణాలు.. ఇలా అన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం కూడా ఉంటుందేమో చూడాలి మరి.. ఇక, పెంపుడు కుక్కలపై పన్ను వేయాలన్న ఆలోచన ఎవరికి వచ్చింది..? ఆ పన్ను వివరాలు ఏంటి? అనే విషయాల్లోకి వెళ్తే..
Read Also: Chandrababu Go Back Flexis: సైకో చంద్రబాబు గో బ్యాక్.. పీలేరులో ఫ్లెక్సీలు..
మధ్యప్రదేశ్‌లోని సాగర్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్‌ఎంసీ) తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది.. పెంపుడు కుక్కల యజమానుల విషయంలో సంచలన నిర్ణయానికి వచ్చింది.. ప్రతీ ఒక్కరూ సాగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో పెంపుడు కుక్కల వివరాలను నమోదు చేయాలని స్పష్టం చేసింది.. అంతేకాదు.. వాటికి టీకాలు వేయించడంతోపాటు పెంపుడు జంతువుల యజమానుల నుంచి భద్రత, పరిశుభ్రత పన్ను కూడా వసూలు చేసేందుకు సిద్ధమైంది.. దీనిపై తాజాగా జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.. ఇక, ఈ తీర్మానాన్ని 40 మంది మున్సిపల్ కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.. త్వరలోనే చట్టాన్ని రూపొందించి ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అమల్లోకి తెచ్చే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.. అయితే, వీధికుక్కల బెడద పెరుగుతుండడంతో.. కుక్కల యజమానులపై పన్ను విధించాలనే నిర్ణయానికి వచ్చిందట ఎస్‌ఎంసీ.. వీధికుక్కలతో పాటు పెంపుడు కుక్కల ద్వారా బహిరంగ ప్రదేశాలు మురికిగా తయారు అవుతున్నాయట.. వీధికుక్కలు, కుక్కలను పెంచే వారి వల్ల సిటీలో చెత్త పెరిగిపోయిందని చెబుతున్నారు.. అంతే కాదు.. మనుషులపై కుక్కలు దాడి చేసిన ఘటలు.. కుక్కలు కరవడంతో ఆస్పత్రిలో చేరినవారి సంఖ్య కూడా పెరిగిపోయిందట.. మొత్తంగా పన్ను బాదేసి.. అవి అదుపుచేయాలనేది వారి ఆలోచనగా కనిపిస్తోంది.. ఇప్పటికే ఈ రకమైన పన్ను విధించబడే నగరాలను అధ్యయనం చేయాలని నిర్ణయించింది ఎస్‌ఎంసీ..