Shatabdi Express: చాయ్ రూ.20 .. సర్వీస్ చార్జ్ రూ 50.. ఖంగుతిన్న ప్రయాణికుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సర్వీస్ చార్జీలు అంటూనే ప్రతి ఒక్కరికి భయం పట్టుకొస్తోంది. ఎందుకంటే మనం కొన్న దానికంటే అదే ఎక్కువగా మోత పడుతుందటంతో వినియోగ దారులకు షాక్ గురయ్యేలా చేస్తోంది. ఏ వస్తువు కొన్న, ఏ తిన్నా దాని పై సర్వీస్ చార్జీలు అంటూ మోత మోగిస్తూ.. కొన్నది యాభైరూపాలదైతే దానిపై సర్వీస్ చార్జ్ అంటూ వంద వరకు వసూలు చేస్తున్నారు. ఏంటిదని అడిగితే అది మామూలే అంటూ చేతులు దులుపుకుంటున్నారు అధికారులు. దీంతో సామాన్యులపై భారంగా మారింది. అయితే మనం తిన్న , తాగిన కూడా దానిపై ప్రయాణించే రైళ్లలో కూడా సర్వీస్ చార్జీలంటూ వసూలు చేయడం పై ప్రయాణికులు మండిపడుతున్నారు. టీ తాగితే దానికంటే ఎక్కవగా సర్వీస్ చార్జీ రావడంతో ఆప్రయాణికుడు షాక్ కు గురయ్యేలా చేసింది. ఈ ఘటన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలులో చోటుచేసుకుంది.
read also:COVID 19: దేశంలో కొత్తగా 16 వేల కేసులు..31 మరణాలు
Also Read
- Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్‌ను ‘‘బాగ్దాద్ ఒప్పందం’’ కాపాడలేదు.. ఇప్పుడు ‘‘ఇస్లామిక్ నాటో’’ పరిస్థితి కూడా అంతేనా?
- Rahul Gandhi: రాహుల్ గాంధీ, మహిళ ఫొటోపై బీజేపీ ప్రశ్నలు.. అసలు విషయం చెప్పిన కాంగ్రెస్
- Tamil Nadu: "విజయ్ ప్రియమైన త్రిషకు డిప్యూటీ సీఎం పదవి ఎప్పుడు.?" అన్నాడీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు..
- Tamil Nadu: "తమిళం నేర్పలేనిది క్రైస్తవ మతం నేర్పింది".. విజయ్ మంత్రి వ్యాఖ్యల కలకలం..
ఓ ప్రయాణికుడికి ఢిల్లీ-భోపాల్ మధ్య నడిచే శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలులో కప్పు చాయ్ ఆర్ఢర్ ఇచ్చాడు. చాయ్ తాగిన ప్రయాణికుడికి చుక్కలు కనిపించాయి.. ఆ చాయ్‌కి అతడు చెల్లించిన బిల్లు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. అయితే.. వినోద్ వర్మ అనే ప్రయాణికుడు జూన్ 28న ఇదే రైలులో ప్రయాణించాడు. కాగా.. రైలులో టీ తాగాలనిపించి ఆర్డర్ చేస్తే ఏకంగా రూ. 70 బిల్లు చేతిలో పెట్టారు. అందులో టీకి రూ. 20, సర్వీస్ చార్జ్ రూ. 50గా పేర్కొనడంతో వినోద్ వర్మ ఆశ్చర్యపోయాడు. అయితే వెంటనే ఆ బిల్లును ఫొటో తీసి ట్వీట్ చేసిన ఆయన.. ‘రూ. 20 టీకీ రూ. 50 సర్వీస్ చార్జీనా?.. మరీ ఇంత దోపిడీనా?’ అని వాపోయాడు.
అయితే ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు సైతం ఆశ్చర్యపోయారు. రైలులో టీకి ఐదు రూపాయలే ఎక్కువని కామెంట్ చేస్తున్నారు. సర్వీస్ చార్జ్ వసూలు చేయకూడదంటూ ప్రభుత్వం ఇటీవల రెస్టారెంట్లకు జారీ చేసిన ఆదేశాల క్లిప్పింగులను మరికొందరు షేర్ చేస్తున్నారు. అయితే..ఈ ట్వీట్ వైరల్ కావడంతో స్పందించిన రైల్వే అధికారులు ప్రయాణికుడి నుంచి తాము అదనంగా ఎలాంటి మొత్తమూ వసూలు చేయలేదని వివరణ ఇచ్చారు. అంతేకాకుండా.. రాజధాని, శతాబ్ది వంటి రైళ్లలో ముందుగా ఆహారం బుక్ చేసుకోకుండా ప్రయాణ సమయంలో బుక్ చేస్తే రూ. 50 సర్వీస్ చార్జ్ చెల్లించాల్సి ఉంటుందంటూ 2018లో జారీ చేసిన సర్క్యులర్‌ను ప్రస్తావించారు.
తాజావార్తలు
-
Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
-
Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్‌పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
-
Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
-
Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్‌ను ‘‘బాగ్దాద్ ఒప్పందం’’ కాపాడలేదు.. ఇప్పుడు ‘‘ఇస్లామిక్ నాటో’’ పరిస్థితి కూడా అంతేనా?
-
KBR Park : కేబీఆర్ పార్క్ చుట్టూ ఇక వన్‌వే ట్రాఫిక్.. కొత్త నిబంధనలు అమల్లోకి.!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..