Site icon NTV Telugu

Lok sabha: సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు.. 8 బిల్లులు ప్రవేశపెట్టే ఛాన్స్

Loksabha

Loksabha

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు సమయం ఆసన్నమైంది. సోమవారం (జూలై 21) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈసారి సమావేశాలు హాట్ హాట్‌గా సాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పహల్గామ్ ఉగ్ర దాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత ఈ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ అంశాలను లేవనెత్తేందుకు ప్రతిపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. వాస్తవంగా ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కానీ అందుకు అధికార పార్టీ నిరాకరిచింది. ఇక బీహార్ ఎన్నికల ముందు ఈసీ చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌పై కూడా సభలో కాంగ్రెస్ లేవనెత్తే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: Pune: ఒకే చోట 3 గంటల్లో 10 ప్రమాదాలు.. వీడియో వైరల్

ఇక ఈ సమావేశాల్లో ఎనిమిది బిల్లులు ప్రవేశపెట్టాలని కేంద్రం కసరత్తు చేస్తోంది. ఆదాయపు పన్ను సంస్కరణ, క్రీడా పాలన, భూ వారసత్వ సంరక్షణతో సహా 8 బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇక మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన పొడిగింపు కోసం ప్రభుత్వం ఉభయ సభల ఆమోదాన్ని కోరనుంది. ఫిబ్రవరి 13, 2025న రాష్ట్రపతి జారీ చేసిన ప్రకటన ద్వారా మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. ఇక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై పార్లమెంటులో అభిశంసన తీర్మానం కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అలాగే నేషనల్‌ స్పోర్ట్స్‌ గవర్నెన్స్‌ బిల్లు, జియోహెరిటేజ్‌ సైట్స్, జియో రెలిక్స్‌(సంరక్షణ, నిర్వహణ) బిల్లు, మైన్స్‌ అండ్‌ మినరల్స్‌(అభివృద్ధి, నియంత్రణ) సవరణ బిల్లు, నేషనల్‌ యాంటీ డోపింగ్‌(సవరణ) బిల్లు, మణి పూర్‌ వస్తువులు, సేవల పన్ను(సవరణ) బిల్లులు ప్రవేశపెట్టే ఛాన్సుంది.

ఇది కూడా చదవండి: Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రత్యేక కథనం! ఏం తేల్చిందంటే..!

జూలై 21న ప్రారంభమయ్యే సమావేశాలు ఆగస్టు 21 వరకు జరగనున్నాయి. వాస్తవానికి ఈ సమావేశాలు
ఆగస్టు 12 వరకే నిర్వహించాలని అనుకున్నారు. కానీ తర్వాత ఆగస్టు 21 వరకు పొడిగించారు. అధికార-ప్రతిపక్షాలు వ్యూహాలు, ప్రతి వ్యూహాలు రచిచూస్తున్నాయి. ప్రతిపక్షాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు అధికార పార్టీ సిద్ధపడుతోంది.

Exit mobile version