రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. రేపటి (జూలై 21) నుంచి వచ్చే నెల ఆగస్టు 21 వరకు మొత్తం 21 రోజుల పాటు “పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు” సాగనున్నాయి. ఆగస్టు 12 నుంచి 18 వ తేదీ వరకు పార్లమెంట్ సమావేశాలకు శెలవు. మొత్తం ఏడు పెండింగ్ బిల్లుల తో పాటు, కొత్తగా మరో ఎనిమిది బిల్లులను ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది. కొత్తగా గౌహతిలో ఐఐఎమ్ ఉన్నత విద్యాసంస్థను నెలకొల్పేందుకు…
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు సమయం ఆసన్నమైంది. సోమవారం (జూలై 21) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈసారి సమావేశాలు హాట్ హాట్‌గా సాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పహల్గామ్ ఉగ్ర దాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత ఈ సమావేశాలు జరుగుతున్నాయి.