Ajit Pawar Plae Crash: ‘‘నాన్నా.. డిప్యూటీ సీఎంతో బారామతి వెళ్తున్నా’’.. కో-పైలట్ చివరి మాటలు
- బారామతి విమాన ప్రమాదంలో ఐదుగురు మృతి
- కో-పైలట్ పింకీ మాలి దుర్మరణం
- బయల్దేరే ముందు తండ్రితో మాట్లాడిన పింకీ మాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బారామతి విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌తో పాటు ఇద్దరు పైలట్లు, ఇద్దరు సహాయకులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఈ దుర్ఘటన దేశ వ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే తాజాగా కో-పైలట్ పింకీ మాలి తన తండ్రితో మాట్లాడిన మాటలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.
బుధవారం ఉదయం 8 గంటలకు ముంబై నుంచి బారామతికి విమానం బయల్దేరింది. అంతక ముందు కో-పైలట్‌గా ఉన్న పింకీ మాలి తన తండ్రి శివకుమార్ మాలితో ఫోన్లో మాట్లాడింది. ‘‘నాన్నా.. డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌తో కలిసి బారామతికి వెళ్తున్నాను. దింపేసిన తర్వాత అక్కడ నుంచి నాందేడ్ వెళ్తాను. మనం రేపు మాట్లాడుకుందాం.’’ అని తన కూతురు మాట్లాడిందంటూ తండ్రి శివకుమార్ గుర్తుచేసుకుంటూ విలపించారు. రేపటి రోజు ఇక ఎప్పటికీ రాదని ఆవేదన చెందారు.
Also Read
- Omar Abdullah Divorce: విడిపోయిన సీఎం దంపతులు.. 17 ఏళ్ల ఎడబాటుకు సుప్రీంకోర్టు ముగింపు!
- Jinping: భారత్ పర్యటనకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్.. వచ్చేదెప్పుడంటే..!
- ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
- Shehzad Poonawalla: బీజేపీకి షాజాద్ పూనావాలా రాజీనామా..
‘‘నేను నా కూతురిని కోల్పోయాను. ఇలాంటి సంఘటనలు గురించి నాకు సాంకేతిక పరిజ్ఞానం లేదు. ఏం జరిగిందో కచ్చితంగా చెప్పలేను. నేను పూర్తిగా కోల్పోయాను. నా కూతురి అంత్యక్రియలు గౌరవంగా నిర్వహించుకునేలా మృతదేహాన్ని అప్పగించాలని కోరుకుంటున్నా. నేను కోరుకునేది ఇదే..’’ అని తండ్రి శివకుమార్ డిమాండ్ చేశాడు.
ఇది కూడా చదవండి: Ajit Pawar: నేడు బారామతిలో అజిత్ పవార్ అంత్యక్రియలు.. హాజరుకానున్న అమిత్ షా
ముంబైలో బుధవారం ఉదయం 8:10 గంటలకు బారామతికి బయల్దేరింది. ఉ.8:42కి మొదటి ల్యాండింగ్ సిద్ధపడింది. కానీ సాధ్యం కాలేదు. రెండోసారి ఉ.8:45కి సిద్ధపడింది. మూడోసారి రాడర్‌తో సంబంధం తెగిపోయి ఉదయం 8:50కి విమానం కూలిపోయింది. బారామతి ఎయిర్‌పోర్టుకు 100 మీటర్ల దూరంలో విమానం కూలిపోయింది. ఒక్కసారిగా మంటలు అంటుకుని కాలిపోయారు. విమానంలో అజిత్ పవార్‌తో పాటు ఆయన వ్యక్తిగత భద్రతా అధికారి విదీప్ జాదవ్, కో పైలట్ పింకీ మాలి, పైలట్ ఇన్ కమాండ్ సుమిత్ కపూర్, సెకండ్ ఇన్ కమాండ్ శాంభవి పాఠక్ ఉన్నారు. మొత్తం అందరూ ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై దర్యాప్తు చేయడానికి ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) బృందం బుధవారం ఢిల్లీ నుంచి పూణెకు వచ్చింది.
ఇది కూడా చదవండి: Social Media Restrictions: సోషల్ మీడియాకు చిన్నారులను దూరంగా ఉంచాల్సిందే.. ఫేక్ పోస్టులపై కఠిన చర్యలు..
తాజావార్తలు
-
Test Cricket: డబ్ల్యూటీసీ రేసులో అసలైన డ్రామా.. 9 మ్యాచ్‌లు, 7 గెలుపులు.. టీమిండియా మైండ్ గేమ్ మొదలు..
-
Telangana Rains: గోదావరి ఉగ్రరూపం.. ములుగు జలదిగ్బంధం, జూరాల గేట్లు ఎత్తివేత.!
-
SS Rajamouli: ‘వారణాసి’ తర్వాత రాజమౌళి ప్లాన్ ఇదేనా..?
-
Iran-US: హార్ముజ్ దగ్గర మళ్లీ ఉద్రిక్తతలు.. రెండు ట్యాంకర్లపై ఇరాన్ దాడి
-
Rohit Sharma New Look: హిట్‌మ్యాన్ ఫొటో లీక్ చేసిన రవిశాస్త్రి.. కొత్త లుక్‌తో ట్రెండింగ్‌లో రోహిత్ శర్మ
ట్రెండింగ్
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!
-
24 క్యారెట్ బంగారంతో లగ్జరీ టచ్.. Caviar నుంచి ప్రత్యేక ఎడిషన్ల స్మార్ట్ ఫోన్స్ లాంచ్.!