Chandigarh: పంజాబ్ యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్తత.. విద్యార్థులపై లాఠీఛార్జ్
- పంజాబ్ యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్తత
- విద్యార్థులపై లాఠీఛార్జ్.. ఐదుగురికి గాయాలు
- పీయూ సెనేట్ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంజాబ్ యూనివర్సిటీలో ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పాల్గొన్న కార్యక్రమంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. క్యాంపస్‌లో ‘పంజాబ్ విజన్ 2047’ కాన్‌క్లేవ్ కార్యక్రమం జరుగుతోంది. సీఎం భగవంత్ మాన్ ప్రసంగిస్తుండగా పెద్ద ఎత్తున విద్యార్థులు చేరుకుని ఆందోళణ చేపట్టారు. పీయూ సెనేట్ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న పంజాబ్ యూనివర్సిటీ విద్యార్థులపై ఒక్కసారిగా చండీగఢ్ పోలీసులు విరుచుకుపడ్డారు. విద్యార్థి, విద్యార్థినులపై లాఠీఛార్జ్ చేశారు.
ఇది కూడా చదవండి: Chandigarh: పంజాబ్ యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్తత.. విద్యార్థులపై లాఠీఛార్జ్
Also Read
- Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
- DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
- Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
- Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
యూనివర్శిటీ లా ఆడిటోరియంలో ఆప్ ఎంపీ విక్రమ్ సాహ్నీ నిర్వహించిన విజన్ పంజాబ్ 2047 కార్యక్రమానికి సీఎం భగవంత్ మాన్, పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్ కటారియా, వీసీ రేణు విజ్, తదితరులు పాల్గొన్నారు. క్యాంపస్‌లో పంజాబ్ సీఎం మన్ ప్రసంగిస్తుండగా సెనేట్ ఎన్నికలు నిర్వహించాలంటూ విద్యార్థులు నిరసన చేపట్టారు. దీంతో పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణ చోటుచేసుకుంది. అనంతరం విద్యార్థులపై లాఠీ జుళిపించారు. విద్యార్థులకు రక్తస్రావం జరిగింది. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి.
ఇది కూడా చదవండి: Retiring Room In Railways: రైల్వే స్టేషన్‌లోని రిటైరింగ్ రూమ్‌లు ఆన్లైన్ లో ఎలా బుక్ చేసుకోవాలో తెలుసా?
సెనేట్ ఎన్నికలు ఆలస్యం కావడాన్ని నిరసిస్తూ విద్యార్థులు శాంతియుత నిరసన చేపట్టారు. ‘పంజాబ్ యూనివర్శిటీ బచావో మోర్చా’ బ్యానర్‌తో విద్యార్థులు తరలివచ్చారు. క్యాంపస్‌లో మార్చ్‌ను నిర్వహించారు. ముఖ్యమంత్రి మాన్ కార్యక్రమంలో ప్రసంగిస్తుండగా ఆడిటోరియం సమీపంలోకి చేరుకున్నారు. పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో ఐదుగురు విద్యార్థులు గాయపడ్డారు. ఆడిటోరియం దగ్గరకు వచ్చేందుకు స్టూడెంట్స్ అనుమతి తీసుకోలేదని.. ఆడిటోరియం చుట్టూ బారికేడ్లు వేయకపోవడం వల్ల విద్యార్థులను లోపలికి వెళ్లకుండా ఆపవలిసి వచ్చిందని పోలీస్ అధికారి తెలిపారు. ఈ ఘటన అనంతరం భారతీయ కిసాన్ యూనియన్ (క్రాంతికారి) సభ్యులు… ఆందోళనకారులతో కలిసి అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదిలా ఉంటే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఎలాంటి కేసులు నమోదు చేయలేదు. నిరసనకారులను అదుపులోకి తీసుకోలేదు.
Chandigarh Police resorted to a lathicharge on peacefully protesting Panjab University students demanding PU Senate elections. The protest took place near the Vision Punjab 2047 event organized by AAP MP Vikram Sawhney in the university’s Law Auditorium, where CM Bhagwant Mann,… pic.twitter.com/MmJdZMAvfa
— Gagandeep Singh (@Gagan4344) November 13, 2024
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!