Pakistan: ఆదివారం ఆసియా కప్ టోర్నీలో భాగంగా భారత్- పాకిస్తాన్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. అయితే, ఈ టోర్నీలో పాక్ పేసర్ హారిస్ రవూఫ్ చేసిన ‘6-0’ సంజ్ఞపై పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్, తాము 6 భారత విమానాలను కూల్చేశామంటూ ప్రగల్భాలు పలుకుతోంది. దీనిపై అక్కడి మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయించింది. తమ ఎయిర్ బేస్‌లు దారుణంగా దెబ్బతిన్న విషయాన్ని కూడా పాకిస్తాన్ మరిచిపోతోంది.
భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ చితక్కొడుతుంటే, ఏం చేయాలో తెలియన హారిస్ రవూఫ్ ఇలా వెక్కిరింతకు దిగాడు. అయితే, పాక్ డైలీ టైమ్స్ అయాబ్ అహ్మద్ రాసిన ఎక్స్ పోస్టును తిరిగి షేర్ చేస్తూ.. ‘‘ హరిస్ హరిస్ రవూఫ్ వారితో సరిగ్గా వ్యవహరిస్తున్నాడు. ఇలాగే కొనసాగించండి. క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతూనే ఉన్నాయి… కానీ 6-0ని భారత్ ఎప్పుడూ మరిచిపోదు. ప్రపంచం కూడా దీనిని గుర్తుంచుకుంటుంది’’ అని పాక్ రక్షణ మంత్రి రాశారు.
Read Also: Maruti Suzuki sales: జీఎస్టీ ఎఫెక్ట్.. నవరాత్రి మొదటి రోజే 25 వేల కార్లు విక్రయించిన మారుతి..
అయితే, పాక్ ప్రచారం చేసుకుంటున్నట్లు భారత్ విమానాలను కూల్చినట్లు ఎక్కడా ధ్రువీకరణ లేదు. భారత్ చేసిన దాడుల్ని మాత్రం ప్రపంచం మొత్తం చూసింది. పాకిస్తాన్ వ్యాప్తంగా సర్గోదా, నూర్ ఖాన్, జకోబాబాద్, స్కర్దు వంటి మొత్తం 11 ఎయిర్ బేసుల్ని భారత్ ధ్వంసం చేసింది. పాక్ ఆర్మీ హెడ్ క్వార్టర్‌గా భావించే రావల్పిండి సమీపంలో నూర్ ఖాన్ ఎయిర్ బేస్‌లో భారత్ దాడికి సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. బ్రహ్మోస్, స్కాల్ప్ మిస్సైళ్లతో పాకిస్తాన్‌ని భారత్ వణికించింది.
భారత వైమానిక దళ చీఫ్ ఏపీ సింగ్ ఆగస్టులో మాట్లాడుతూ.. పాక్ 6 విమానాలను కోల్పోయిందని స్పష్టం చేశారు. ఇందులో 5 ఫైటర్ జెట్లు కాగా, ఒకటి పెద్ద విమానం (బహుషా అవాక్స్ విమానం) కావచ్చు అని చెప్పారు. భారత్ దాడులు పాకిస్తాన్‌కు భారీ నష్టాన్ని కలిగించాయని, అందుకే పాకిస్తాన్ కాల్పుల విరమణ కోసం బ్రతిమిలాడిందని చెప్పుకొచ్చారు.
