Pakistan: భారత్‌పై యుద్ధానికి సిద్ధమైన పాక్.. దేశాన్ని ఉద్దేశించి పీఎం షెహబాజ్ షరీఫ్ ప్రసంగం..
- యుద్ధానికి సిద్ధమైన పాకిస్తాన్..
- పాక్ సైన్యానికి పీఎం షెహబాజ్ షరీఫ్ కీలక ఆదేశాలు..
- కాసేపట్లో దేశాన్ని ఉద్దేశించి ప్రసంగం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్, బుధవారం తెల్లవారుజాము ‘‘ఆపరేషన్ సిందూర్’’ పేరుతో పీఓకే, పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను నామరూపాలు లేకుండా చేసింది. ఈ దాడుల్లో సుమారుగా 80 మంది వరకు ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం. భారత్ జరిపిన దాడిలో ఒక్కసారిగా పాకిస్తాన్ షాక్‌కి గురైంది. ఇదిలా ఉంటే, ఈ దాడులపై పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్, ఆర్మీ, ఇతర ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశాలు నిర్వహించారు.
Read Also: Scalp, Hammer: “స్కాల్ప్, హామర్”లతో పాకిస్తాన్లో దీపావళి.. ఈ ఆయుధాలనే భారత్ ఎందుకు వాడింది..?
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం, ఈ దాడులకు ప్రతీకారం తీర్చుకోవాలని పాకిస్తాన్ ప్రభుత్వం సైనిక దళాలను కోరింది. భారత సైనిక చర్యకు ప్రతిస్పందనగా, పాకిస్తాన్ భారతీయ దౌత్యవేత్తను పిలిచి, నిరసన తెలియజేసింది. భారత దాడులకు ప్రతీకారం తీర్చుకునే హక్కు పాకిస్తాన్‌కి ఉందని ఆ దేశ సమాచార మంత్రి అతుల్లా తరార్ తీవ్రంగా స్పందించారు.
ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ ‘‘కఠినమైన యుద్ధ చర్య’’కు పాల్పడిందని పాక్ ఆరోపించింది. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. పాకిస్తాన్ పీఎం షహాబాజ్ షరీఫ్ బుధవారం జాతీయ ప్రసంగానికి ముందు అత్యవసర జాతీయ భద్రతా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. భారత్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు ఎక్కువ సమయం పట్టదని, ఇప్పటికే సైనిక కార్యకలాపాలు జరుగుతున్నాయని అన్నారు.
ఇదిలా ఉంటే, భారత ‘‘ఆపరేషన్ సిందూర్’’కి ప్రతీకారం తీర్చుకోవాలని పాక్ సైన్యాన్ని పీఎం షెహబాజ్ షరీఫ్ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్ ప్రభుత్వం ‘‘రెడ్ అలర్ట్’’ జారీ చేసింది. ఈ నేపథ్యంలో భారత్‌పై పాకిస్తాన్ దాడి చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరికొద్ది సేపట్లో, పాక్ పీఎం ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడనున్నారు. దేశ భద్రత, పాక్ ఆర్మీ తీసుకుంటున్న చర్యల్ని ప్రజలకు వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
GST Council Big Decision: జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం.. అరెస్ట్ అధికారాల తొలగింపు, రూ.5 కోట్లకు ప్రాసిక్యూషన్ పరిమితి
-
Astrology: అక్టోబర్ 09 శుక్రవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లిస్తే అంతా శుభమే..!
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!