NTV Telugu Site icon

PM Modi: ప్రధాని నరేంద్రమోడీకి పాకిస్తాన్ ఆహ్వానం..!

Pm Modi

Pm Modi

PM Modi: దాయాది దేశం పాకిస్తాన్ భారత ప్రధాని నరేంద్రమోడీకి ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 15-16 తేదీల్లో ఇస్లామాబాద్‌లో జరగబోతున్న షాంఘై కోఆపరేషణ్ ఆర్గనైజేషన్(ఎస్‌సీఓ) కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ (సిహెచ్‌జి) సమావేశానికి పాకిస్తాన్ పీఎం మోడీతో పాటు ఇతర నాయకులను ఆహ్వానించినట్లు సమాచారం. ఎస్‌సీఓ యొక్క రెండో అత్యున్నత నిర్ణయాధికార సంస్థ సీహెచ్‌జీకి పాకిస్థాన్ ఈ ఏడాది ఛైర్మన్‌గా వ్యవహరిస్తోంది. అయితే, పాకిస్తాన్-ఇండియా మధ్య సంబంధాలు అంతంత మాత్రంగా ఉండటంతో ప్రధాని పాకిస్తాన్ వెళ్లడం దాదాపుగా అనుమానమే.

Read Also: Pakistan: పాక్‌లో ఘోరం.. బస్సు కాలువలో పడి 29 మంది మృతి..

గతేడాది కిర్గిజిస్థాన్‌లోని బిష్‌కెక్‌లో జరిగిన సీహెచ్‌జీ సమావేశానికి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ హాజరయ్యారు. ఎస్‌సీఓ సమావేశాలకు తప్పకుండా హాజరయ్యే ప్రధాని మోడీ గతేడాది పార్లమెంట్ సమావేశాల కారణంగా ఈ ఏడాది జరిగిన కజకిస్తాన్ శిఖరాగ్ర సమావేశానికి దూరమయ్యారు. రష్యా, చైనా నేతృత్వంలోని SCO ప్రాంతీయ భద్రత మరియు సహకారానికి కీలకమైనది. భారతదేశం, చైనా, రష్యా, పాకిస్తాన్, కజకిస్తాన్, కిర్గిజ్‌స్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్‌లు ఎస్‌సీఓ సభ్యదేశాలుగా ఉన్నాయి.