Pakistan: పాకిస్తాన్ నిజస్వరూపం ఇది.. పహల్గామ్ దాడి ఉగ్రసంస్థకు మద్దతు..
- మరోసారి బయటపడిన పాకిస్తాన్ నిజస్వరూపం..
- పహల్గామ్ దాడికి పాల్పడిన ఉగ్రసంస్థకు మద్దతు..
- టీఆర్ఎఫ్‌కు మద్దతుగా నిలిచిన ఆ దేశ విదేశాంగ మంత్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్‌కు ఉగ్రవాదానికి ఉన్న సంబంధాలను బయటపెట్టుకోవడంలో ఆ దేశం ఎప్పుడూ సిగ్గుపడటం లేదు. తాజాగా, పహల్గామ్ ఉగ్రవాడికి బాధ్యత వహించిన ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF)’’కు మద్దతు తెలుపుతోంది. ఏకంగా పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కామెంట్స్ కొత్త వివాదానికి దారి తీశాయి. ప్రస్తుతం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(UNSC)లో నాన్-పర్మినెంట్ సభ్యుడిగా ఉన్న పాకిస్తాన్, పహల్గామ్ ఉగ్రదాడిని ఖండిస్తూనే, ఉగ్రవాద సంస్థ టీఆర్ఎఫ్ ప్రస్తావనను నిరోధించింది. ఈ టీఆర్ఎఫ్, కరడుగట్టిన లష్కరే తోయిబా ఉగ్రసంస్థ అనుబంధం సంస్థగా ఉంది. ఈ విషయాన్ని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ వెల్లడించారు.
Read Also: Operation Sindoor: పాకిస్తాన్ “కిరాణా హిల్స్”పై భారత్ దాడి చేసింది..
Also Read
యూఎన్ఎస్‌సీ ప్రకటన నుంచి టీఆర్ఎఫ్ తొలగించాలని, ఉగ్రవాద దాడుల్ని, అణిచివేతకు వ్యతిరేకంగా జరుగుతున్న దాడులుగా చిత్రీకరించాలని, లష్కరే తోయిబా ఉగ్రసంస్థను దౌత్యపరంగా రక్షించేందుకు లాబీయింగ్ చేసినట్లు ఇషాక్ దార్ అంగీకరించారు. ‘‘UNSC ప్రకటనలో TRF గురించి ప్రస్తావించడాన్ని మేము వ్యతిరేకించాము. ప్రపంచం రాజధానుల నుంచి నాకు కాల్స్ వచ్చాయి, కానీ పాకిస్తాన్ అంగీకరించలేదు’’ అని దార్ చెప్పిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. టీఆర్ఎఫ్ పేరును ఐక్యరాజ్యసమితి ప్రకటన నుంచి తొలగించడంలో పాకిస్తాన్ విజయం సాధించినట్లు చెప్పారు.
‘‘మేము TRF చట్టవిరుద్ధమని పరిగణించము. వారు పహల్గామ్ దాడిని చేశారని రుజువు చూపించండి. TRF యజమానుల్ని చూపించండి. మేము ఆ ఆరోపణను అంగీకరించము, TRFని UN ప్రెస్ రిలీజ్ నుండి తొలగించాల్సి వచ్చింది’’ అని ఆయన అన్నారు. కొన్ని రోజుల క్రితం, అమెరికా అధికారికంగా టీఆర్ఎఫ్‌ను విదేశీ ఉగ్రవాద సంస్థ((FTO)గా ప్రకటించింది. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో విడుదల చేసిన ప్రకటనలో.. టీఆర్ఎఫ్ లష్కరే తోయిబా ప్రతినిధి సంస్థగా అభివర్ణించింది. 2008 ముంబై దాడుల తర్వాత భారత పౌరులపై జరిగిన అత్యంత ఘోరమైన దాడిగా ‘‘పహల్గామ్ దాడి’’ని యూఎస్ అభివర్ణించింది.
తాజావార్తలు
-
ENG W vs SL W: శతకంతో ‘డ్యానీ వ్యాట్’ వీరవిహారం.. మహిళల టీ20 ప్రపంచకప్లో ఇంగ్లండ్ బోణి.!
-
Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్లో కలకలం.. 22 మంది అధికారుల సస్పెన్షన్
-
Astrology: జూన్ 13 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
-
CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
-
Family Suicide: ఇంత ఘోరమా? ముక్కుపచ్చలారని పసిబిడ్డల పట్ల విలన్గా మారిన తండ్రి
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!