Site icon NTV Telugu

Pakistan: ‘‘ మీరు ఇజ్జత్ కొనలేరు’’.. పాకిస్తాన్‌పై సొంత ప్రజల విమర్శలు..

Asim Munir

Asim Munir

Pakistan: భారత్-అమెరికా మధ్య ట్రేడ్ డీల్ కుదిరింది. ప్రస్తుతం ఈ డీల్ పలు దేశాలకు నిద్ర లేకుండా చేస్తోంది. ముఖ్యంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లో వణుకు మొదలైంది. అయితే, పాకిస్తాన్‌లో సొంత ప్రజలే ఆ దేశాన్ని తిట్టిపోస్తున్నారు. ట్రంప్‌తో పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్, సైన్యాధిపతి ఆసిమ్ మునీర్‌‌లు అంటకాగిన భారత్ లాంటి డీల్ కుదర్చుకోలేకపోయామని ఆ దేశం వాపోతోంది. ట్రంప్ ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసినా భారత్ కన్నా అధిక సుంకాల భారం పడుతోందని పాక్ ప్రజలు చెబుతున్నారు.

Read Also: మరింత అందుబాటులో కొత్త Hyundai i20.. రూ.5.99 లక్షల ప్రారంభ ధరతో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్!

సోషల్ మీడియా పోస్టుల్లో సొంత దేశ ప్రభుత్వాని పాక్ నెటిజన్లు ఆటాడుకుంటున్నారు. ట్రంప్ సోషల్ మీడియాలో ఇండియా గేట్ ఫొటోలు, ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి ఉన్న మ్యాగజైన్ కవర్‌ను షేర్ చేసి, టారిఫ్ తగ్గిస్తున్నట్లు ప్రకటించడం పాకిస్తాన్‌ను మరింత అసంతృప్తికిలోకి నెట్టింది. భారత వస్తువులపై అమెరికా 18 శాతం సుంకం ఉంటే, పాకిస్తాన్‌పై 19 శాతం సుంకం ఉంది. పాక్ నెటిజన్లలో ఉమర్ అలీ అనే వ్యక్తి.. ‘‘ డొనాల్డ్ ట్రంప్ అసిమ్ మునీర్‌ను అన్ని చెత్త పనులు చేసే ఉంపుడుగత్తెగా మార్చాడు. ఏదైనా ఇవ్వాల్సి వచ్చినప్పుడు నా కుటుంబ నిర్ణయాన్ని పాటించాల్సి ఉంటుంది. నన్ను మర్చిపో అని చెబుతున్నాడు.’’ అని అన్నారు.

పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) మాజీ మంత్రి హమ్మద్ అజార్ ఈ ఫలితాన్ని పరిస్థితుల కన్నా వ్యూహం వైఫల్యంగా అభివర్ణించాడు. విదేశాంగ విధానం వ్యక్తిగత సంబంధాలపై కాదు, ఆర్థిక బలం, మార్కెట్‌పై ఆధారపడి ఉంటుందని, భారత్ చేసుకున్న ఒప్పందాలే ఇందుకు నిదర్శనమని అన్నారు. జర్నలిస్టులు అసద్ తూర్, ఇమ్రాన్ రియాజ్ ఖాన్ వంటి వారు కూడా పాక్ ప్రభుత్వాన్ని విమర్శించారు. ‘‘ఖనిజాలను పెట్టెల్లో ఇచ్చినా గౌరవాన్ని కొనలేరు’’ అని చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.

Exit mobile version