Site icon NTV Telugu

Pakistan: ‘‘మజా రాకుంటే పైసల్ వాపస్’’.. పాకిస్తాన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు..

Pakistan

Pakistan

Pakistan: భారత్‌ను ఉద్దేశించి పాకిస్తాన్ మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది. పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్‌పిఆర్) డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి మాట్లాడుతూ.. పాకిస్తాన్‌పై ఆఫ్ఘనిస్తాన్ జరుపుతున్న దాడులను భారత్‌తో ముడిపెడుతూ ఆరోపణలు చేశారు. ఇటీవల, ఒక పత్రికా సమావేశంలో మహిళా జర్నలిస్టుకు కన్నుకొట్టి విమర్శలు పాలైన చౌదరి, భారత్‌ను ఎగతాళి చేసే వ్యాఖ్యలు చేశారు.

Read Also: Warangal: వరంగల్ చౌరస్తాలో కత్తితో వివాహిత హల్చల్.. భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని..

భారతదేశాన్ని రెచ్చగొడుతూ, బెదిరించేలా మాట్లాడుతూ.. ‘‘ఒకసారి మజా రాకపోతే డబ్బులు వాపస్’’ అని అన్నారు. సాధారణంగా ప్రత్యర్థుల్ని ఎగతాళి చేసేందుకు, రెచ్చగొట్టేందుకు ఈ వ్యాఖ్యల్ని ఉపయోగిస్తారు. 2026 పాకిస్తాన్‌కు ఎలా ఉంటుందనేది, మనం ఎలా నిబడుతాము, ఎలా స్పందిస్తామనే దానిపై ఆధారపడి ఉంటుంది. భారత్ ఎప్పటికీ పాకిస్తాన్ ఉనినికి అంగీకరించదు. భారత్ శత్రువుకు శత్రువు మిత్రుడు అనే ధోరణితో వ్యవహరిస్తోందని చౌదరి అన్నారు. మన విధి మన చేతుల్లోనే ఉందంటూ, పాకిస్తాన్ దేవుడు ఇచ్చిన బహుమతి అన్నారు.

‘‘మీరు ఏం చేయాలనుకుంటే అది చేయండి, మీరు ఎక్కడి నుంచి రావాలనుకుంటే అక్కడి నుంచి రండి, ఎంత మందితో అయినా కలిసి రండి, ఒక్కసారి మజా చూపించకపోతే డబ్బులు వెనక్కి ఇస్తాం’’ అని అంటూ, భారతదేశం ఆప్ఘనిస్తాన్‌కు ప్రాక్సీగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. దీనికి ముందు పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మాట్లాడుతూ.. ఆఫ్ఘనిస్తాన్, భారత్ నిషేధిత తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (టిటిపి)తో కలిసి పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు.

Exit mobile version