Pakistan: భారత్‌ను ఉద్దేశించి పాకిస్తాన్ మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది. పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్‌పిఆర్) డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి మాట్లాడుతూ.. పాకిస్తాన్‌పై ఆఫ్ఘనిస్తాన్ జరుపుతున్న దాడులను భారత్‌తో ముడిపెడుతూ ఆరోపణలు చేశారు. ఇటీవల, ఒక పత్రికా సమావేశంలో మహిళా జర్నలిస్టుకు కన్నుకొట్టి విమర్శలు పాలైన చౌదరి, భారత్‌ను ఎగతాళి చేసే వ్యాఖ్యలు చేశారు.