NTV Telugu Site icon

Pakistan: భారత్ వల్లే లాహోర్లో కాలుష్యం.. పాక్ వింత వాదన

Pak

Pak

Pakistan: పాకిస్థాన్ మరోసారి భారత్ పై తన అక్కసు వెళ్లగక్కింది. తమ దేశంలో కాలుష్యానికి భారతదేశమే కారణమని ఆరోపించింది. ఈ మేరకు పాకిస్థాన్ లోని పంజాబ్ మంత్రి మరియం ఔరంగజేబ్ ఓ టీవీ ఇంటర్వ్యూలో ఈ కామెంట్స్ చేశారు. శీతాకాలంలో ఢిల్లీ, హర్యానా, పంజాబ్ తదితర ఉత్తరాది రాష్ట్రాల్లో వాయు కాలుష్యం బాగా పెరిగిపోతుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అసాధారణ స్థాయిలో నమోదు అవుతుంది. మన దేశంలోనే కాదు పాకిస్థాన్ లోని లాహోర్ సిటీలో వాయు కాలుష్యం ఇటీవల భారీగా పెరిగిపోయింది.

Read Also: Undrajavaram Incident: మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి కందుల దుర్గేష్‌..

ఏక్యూఐ ఏకంగా 1,067 పాయింట్లుగా రికార్ట్ అయింది. దీనిపై అక్కడి మంత్రి మరియం ఆదివారం ఓ మీడియాతో మాట్లాడుతూ.. లాహోర్ లో వాయు కాలుష్యం పెరగడానికి భారతలోని పంజాబ్ నుంచి వీచే గాలులే కారణమని వింత ఆరోపణలు చేసింది. గాలి వేగం, వీచే దిశ మారడం వల్ల పొరుగు దేశం నుంచి కలుషిత గాలి లాహోర్ కు చేరుకుని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) దారుణంగా పెరిగిందని విమర్శించింది. ఇక, ఆదివారం లాహోర్ లో ఏక్యూఐ 500 పాయింట్లకు అటూ ఇటుగా ఉందని ఆమె తెలిపారు. అయితే, ఈ విషయంలో మనం చేయగలిగింది ఏమీ లేదన్నారు. వీచే గాలిని ఆపడం కుదరదు.. భారత్ తో చర్చల ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని వెల్లడించింది.