Abir Gulaal: పాక్ యాక్టర్ ఫవాద్ ఖాన్ ‘‘బాలీవుడ్’’ సినిమాపై నిషేధం.!
- పాక్ యాక్టర్ ఫవాద్ ఖాన్ ‘‘బాలీవుడ్’’ సినిమాపై నిషేధం.!
- ‘అబీర్ గులాల్’’ సినిమా విడుదలపై బ్యాన్..
- పహల్గామ్ దాడి తర్వాత పాక్ సినిమాలు, నటులపై చర్యలకు ప్రజల డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abir Gulaal: పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయకపు టూరిస్టులు చనిపోయారు. పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ అయిన లష్కరే తోయిబాకు అనుబంధంగా పనిచేస్తున్న ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ ఈ దాడికి పాల్పడినట్లు ప్రకటించింది. మంగళవారం, పహల్గామ్లోని బైసరీన్ పచ్చిన మైదానాలు చూస్తున్న టూరిస్టులపై ముష్కరులు దాడి చేశారు. ఈ ఘటన యావత్ దేశాన్ని శోకంలో ముంచింది. ఇదిలా ఉంటే, పాకిస్తాన్‌పై తీవ్ర చర్యలు ఉండాలని దేశ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే, భారత్ పాక్‌తో దౌత్య సంంధాలను తెగదెంపులు చేసుకుంది. పాకిస్తాన్‌తో ‘‘సింధు జలాల ఒప్పందం’’ని రద్దు చేసుకుంది. ఇకపై పాకిస్తాన్ జాతీయులకు వీసాలు ఇవ్వబోమని తెగేసి చెప్పింది.
Read Also: Hyderabad : రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఈ 7 జిల్లాలకు రెడ్ అలర్ట్..
Also Read
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- INS Nipun: భారత నౌకాదళంలోకి స్వదేశీ డైవింగ్ షిప్.. 300 మీటర్ల లోతు వరకు ఆపరేషన్స్
- Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
- GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్‌కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
తాజాగా, మరో చర్యకు భారత్ సిద్ధమైంది. పాకిస్తానీ నటులపై నిషేధం విధించే ఆలోచనలో ఉంది. ఈ మేరకు పాకిస్తానీ యాక్టర్ ఫవాద్ కాన్ నటించిన బాలీవుడ్ సినిమా ‘‘అబీర్ గులాల్’’ భారతదేశంలో విడుదల కావడం లేదని కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. వాణి కపూర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో మే 9న థియేటర్లలోకి రానుంది. వివేక్ బి అగర్వాల్ నిర్మించిన ఈ సినిమాకు ఆర్తి ఎస్ బాగ్ది డైరెక్షన్ చేశారు. ‘అబీర్ గులాల్’ ఈ నెల ప్రారంభంలో రాజ్ థాకరే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన భారతదేశంలో విడుదలను వ్యతిరేకించింది. తాజాగా, పహల్గామ్ ఘటన తర్వాత ఈ సినిమాపై మరింత వ్యతిరేకత పెరిగింది.
సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ వర్గాల సమాచారం ప్రకారం, సినిమా థియేటర్లు ఈ సినిమాను ప్రదర్శించేందుకు సిద్ధంగా లేవని, అనేక వినోద సంస్థలు దీనిని బహిష్కరించాలని డిమాండ్ చేశాయని, ఇప్పుడు మంత్రిత్వ శాఖ కూడా దాని విడుదలకు అనుమతి నిరాకరించాలని నిర్ణయించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, ఫవాద్ ఖాన్ పహల్గామ్ మృతులకు తన సంతాపాన్ని తెలియజేశారు. “పహల్గామ్లో జరిగిన దారుణమైన దాడి వార్త విని చాలా బాధపడ్డాను. ఈ భయంకరమైన సంఘటన బాధితులతో మా ఆలోచనలు, ప్రార్థనలు ఉన్నాయి . ఈ క్లిష్ట సమయంలో వారి కుటుంబాలకు బలం, స్వస్థత కోసం మేము ప్రార్థిస్తున్నాము” అని నటుడు ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Veta: ‘పెదరాయుడు’ లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
-
PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్‌పే..
-
Kalabhairava : కావ్య కల్యాణ్‌రామ్‌తో రిలేషన్ అనౌన్స్ చేసిన కాలభైరవ
-
Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన ‘ఇరుముడి’!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!