Pakistan: పాకిస్తాన్ తన నీచబుద్ధిని పోనిచ్చుకోవడం లేదు. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు 26 మంది అమాయకుల్ని చంపారనేది సుస్పష్టం. అయినా కూడా, ఆ దేశ నాయకత్వం తమ తప్పు లేదని చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది. అజర్‌బైజాన్ వేదికగా జరిగిన ఆర్థిక సహకార సంస్థ(ఈసీఓ) శిఖరాగ్ర సమావేశంలో పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ భారత్‌పై అక్కసును వెళ్లగక్కారు. భారత్ పహల్గామ్ ఉగ్రదాడిని ప్రాంతీయ శాంతి దెబ్బతీసేందుకు ఉపయోగించుకుంటుందని ఆరోపించారు. భారతదేశ ప్రతిస్పందనను ‘‘ప్రేరేపించిన, నిర్లక్ష్య శత్రుత్వం’’గా అభివర్నించారు. ఈ ప్రాంతాన్ని అస్థిరపరచడమే భారత్ ఉద్దేశమని చెప్పారు.
Read Also: Anil Ravipudi : సుడిగాలి సుధీర్ ను వాళ్లే రోస్ట్ చేయమన్నారు.. అనిల్ రావిపూడి కామెంట్స్..
26 మందిని బలిగొన్న ఉగ్రదాడికి లష్కరేతోయిబా అనుబంధ సంస్థ ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్) బాధ్యత వహించింది. అయితే, దీనికి ప్రతీకారంగా భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ జరిపి పాకిస్తాన్, పీఓకే లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసి, 100 మందికి పైగా ఉగ్రవాదుల్ని హతమార్చింది. ఆ తర్వాత పాక్ సైన్యం కవ్విస్తే, వారి 11 ఎయిర్ బేస్‌లను ధ్వంసం చేసింది.
అయితే, షరీఫ్ మరోసారి కాశ్మీర్ సమస్యను లేవనెత్తాడు. కాశ్మీర్ పౌరులపై అనాగరిక చర్యలు జరుగుతున్నాయిని, వాటిని ఖండించారు. గాజాలో హింసను, ఇరాన్‌పై ఇజ్రాయిల్ దాడుల్ని కూడా షరీఫ్ ఖండించారు. “గాజా, కాశ్మీర్ లేదా ఇరాన్‌లో అయినా అమాయక ప్రజలపై అనాగరిక చర్యలకు పాల్పడే వారిని పాకిస్తాన్ గట్టిగా వ్యతిరేకిస్తుంది” అని షరీఫ్ తన ప్రసంగంలో అన్నారు.
