బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో చీలికలు రచ్చకెక్కాయి. విభేదాలు కారణంగా కుటుంబ సభ్యులంతా ఎవరికి వారే వేరైపోయినట్లుగా తెలుస్తోంది. తాజాగా లాలూ కుమార్తె రోహిణి ఆచార్య ఆసక్తికర ట్వీట్ చేశారు. గొప్ప వారసత్వాన్ని నాశనం చేయడానికి సొంత మనుషులే చాలు అని వ్యాఖ్యానించారు. అహంకారం, అనాలోచిత సలహా కారణంగా కుటుంబంలో కొంతమంది ఉనికి, గుర్తింపు పోతుందని వాపోయారు. అహంకారం ఆవహించినప్పుడు నిర్ణయాలు నియంత్రిస్తాయని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: Trump-Putin: పుతిన్ నా ఫ్రెండ్.. అలా చేయను.. ప్రెస్‌మీట్‌లో ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
అయితే ఈ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి పెట్టారో తెలియదు గానీ.. కుటుంబంలో నెలకొన్న రగడ గురించి అని మాత్రం తెలుస్తోంది. అయితే ఈ పోస్ట్ తేజస్వి యాదవ్‌ను ఉద్దేశించే పెట్టినట్లుగా ఆర్జేడీ శ్రేణులు భావిస్తున్నారు. బీహార్ ఎన్నికల ఫలితాల్లో ఓటమి తర్వాత తేజస్వి యాదవ్‌పై రోహిణి ఆచార్య అనేక ఆరోపణలు చేశారు. తాజాగా పేరు వెల్లడిపరచకపోయినా.. సోదరుడి గురించేనని అంతా అనుమానిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Bihar: జేడీయూ సీనియర్ నేత కేసీ త్యాగికి షాక్.. పార్టీ నుంచి బహిష్కరణ
గత నవంబర్‌లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 243 స్థానాలకు గాను 140 సీట్లలో ఆర్జేడీ పోటీ చేసింది. కానీ కేవలం 25 సీట్లనే గెలుచుకుంది. ఎన్డీఏ కూటమి భారీ విజయాన్ని అందుకుంది. బీజేపీ 89, జేడీయూ 85 గెలుచుకున్నాయి. మొత్తంగా 202 స్థానాలు సొంతం చేసుకుంది. నితీష్ కుమార్ తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు.
