Uttar Pradesh: పొరపాటున ఒవైసీకి గౌరవ వందనం.. సీవోపై బదిలీ వేటు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh: ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి ఉత్తరప్రదేశ్‌లో పోలీసులు పొరపాటున గౌరవ వందనం సమర్పించిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. అయితే, ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసు యంత్రాంగం సంబంధిత అధికారిపై చర్యలు తీసుకుంది. సదర్ సర్కిల్ ఆఫీసర్ (సీవో) పవన్ కుమార్‌ను ఆయన ప్రస్తుత బాధ్యతల నుంచి తొలగించి ట్రాఫిక్ విభాగానికి బదిలీ చేసింది. సహారన్పూర్ గ్రామీణ పోలీసు సూపరింటెండెంట్ మయాంక్ పాఠక్ ఈ విషయాన్ని వెల్లడించారు. పవన్ కుమార్‌ను సదర్ సీవో పదవి నుంచి తొలగించి, సర్కిల్ ఆఫీసర్ (ట్రాఫిక్)గా నియమించినట్లు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, సంఘటన జరిగిన సమయంలో అక్కడ విధుల్లో ఉన్న ఇతర పోలీసు అధికారుల పాత్రను కూడా పరిశీలిస్తున్నామని స్పష్టం చేశారు.
అసలు ఏం జరిగిందంటే?
అయితే, శనివారం సహారన్‌పూర్‌లోని సర్క్యూట్ హౌస్ వద్ద ఒవైసీకి పొరపాటును గౌరవ వందనం చేశారు పోలీసులు.. వాస్తవానికి ఆ రోజు సుప్రీంకోర్టుకు చెందిన ఓ న్యాయమూర్తి సర్క్యూట్ హౌస్‌కు రావాల్సి ఉంది. ఆయనకు స్వాగతం పలికేందుకు పోలీసు అధికారులు గౌరవ వందనం సమర్పించే ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం పోలీసు సిబ్బందిని కూడా అక్కడ మోహరించారు. కానీ, న్యాయమూర్తి రాకముందే ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తన భద్రతా సిబ్బందితో కలిసి సర్క్యూట్ హౌస్‌కు చేరుకున్నారు. ఆయన వెంట భద్రతా సిబ్బంది ఉండటంతో పోలీసులు అపార్థం చేసుకున్నారు. న్యాయమూర్తి వచ్చారని భావించి ఒవైసీకి గౌరవ వందనం సమర్పించారు. పోలీసుల సెల్యూట్‌ను ఒవైసీ కూడా నిలబడి స్వీకరించారు. ఈ సమయంలో పోలీసులు ఆయనకు పూర్తి గౌరవంతో వందనం చేస్తున్న దృశ్యాలు వీడియోలో కనిపించాయి.
Also Read
- Stock Market: ఎన్విడియా సీఈఓగా జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ.. స్టాక్ మార్కెట్లో భారీ ర్యాలీ..
- PM Modi: నేపాల్‌కు భారీ సాయం.. రూ.15 వేల కోట్ల అభివృద్ధి ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని మోడీ..
- Bihar MLA Anant Singh: బీహార్ ఎమ్మెల్యే కుమార్తె పెళ్లి.. 50 లక్షల గులాబ్ జామూన్లు, విజేతకు థార్ కారు!
- UP Elections 2027: యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ డిమాండ్.. ఎస్పీకి 130 స్థానాల జాబితా!
సోషల్ మీడియాలో వైరల్.. విచారణ ప్రారంభం
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో పోలీసు శాఖలో ఈ వ్యవహారం చర్చకు దారితీసింది. ఘటనపై అధికారులు విచారణ ప్రారంభించారు. మరోవైపు, ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, పోస్టులను తొలగించాలని కోరుతూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (X)కు లేఖ రాసినట్లు గ్రామీణ పోలీసు సూపరింటెండెంట్ తెలిపారు. విచారణలో భాగంగా సదర్ సీవో పవన్ కుమార్‌పై బదిలీ వేటు పడింది. అయితే, ఘటన సమయంలో అక్కడ ఉన్న ఇతర పోలీసు సిబ్బంది బాధ్యతలపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది. పూర్తి విచారణ అనంతరం ఈ వ్యవహారంలో మరిన్ని చర్యలు ఉండే అవకాశముంది.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-10 Live : కోటి దీపోత్సవంలో శివారాధన.. భక్తుల చేతుల మీదుగా నవధాన్యార్చన.!
-
Uttar Pradesh: పొరపాటున ఒవైసీకి గౌరవ వందనం.. సీవోపై బదిలీ వేటు..!
-
NVIDIA CEO Jensen Huang: ఈసారి మంచి సీఈఓగా ఉంటా.. కౌగిలించుకున్న మహిళా ఉద్యోగి.. భావోద్వేగానికి గురైన జెన్సన్ హువాంగ్!
-
Astrology: నవంబర్ 24 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారు.. ఈ పరిహారం చెల్లించండి..!
-
Koti Deepotsavam 2026 : కార్తీక సోమవారం.. కోటి దీపోత్సవంలో ఏకామ్రేశ్వరస్వామి కల్యాణ శోభ
-
Gas Stove Knob Cleaning Tips : గ్యాస్ స్టవ్ నాబ్లపై జిడ్డు మరకలా?.. ఈ సింపుల్ ట్రిక్‌తో మాయం!
ట్రెండింగ్
-
WhatsApp Web Security Alert: వాట్సాప్ వెబ్ వాడుతున్నారా?.. కేంద్రం బిగ్ అలర్ట్.!
-
Woman Adopts Pig : పదేళ్ల పెళ్లి బంధానికి గుడ్‌బై.. పందిపిల్లతో కొత్త జీవితం
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, OLED డిస్ప్లేలతో HONOR 700 Series లాంచ్..!
-
Indian Rupee Falls: మళ్లీ పడిపోయిన రూపాయి.. ఒక్కరోజే 23 పైసలు పతనం..!
-
Mohammed Siraj-Gill: సిరాజ్‌ను అందుకే పక్కనపెట్టాం.. శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!