Site icon NTV Telugu

Operation Sindoor: భారత్ దాడి చేస్తుంటే, పాక్ సైన్యం నమాజ్ చేసింది..

Operation Sindoor

Operation Sindoor

Operation Sindoor: గతేడాది పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత్ పాకిస్తాన్‌పై ‘‘ఆపరేషన్ సిందూర్’’ నిర్వహించింది. పాకిస్తాన్ లోని బహవల్పూర్‌లోని జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయంతో పాటు, మురిడ్కే లోని లష్కరే తోయిబా స్థావరాలను, పీఓకేలోని ఇతర ఉగ్రవాద స్థావరాలనను ధ్వంసం చేసింది. వందలాది మంది ఉగ్రవాదుల్ని హతమార్చింది. ఇదే కాకుండా పాక్ సైన్యం కవ్వింపులకు ధీటుగా బదులిచ్చింది. పాక్ వైమానిక దళానికి చెందిన పలు ఎయిర్ బేసుల్ని క్షిపణులు, డ్రోన్లతో ధ్వంసం చేసింది.

అయితే, ఇన్నాళ్లు తమకేం నష్టం జరగలేదని చెబుతూ వస్తున్న పాకిస్తాన్, ఇప్పుడు మాత్రం నిజాలను ఒప్పుకుంటోంది.పాకిస్తాన్ ఎయిర్ కమోడోర్(రిటైర్డ్) మాజీ పాకిస్తాన్ వైమానిక దళ అధికారి, రక్షణ విశ్లేషకుడు ఖలీద్ చిస్తీ, జీఎన్ఎన్ స్టూడియో పాక్‌కాస్ట్‌లో సంచలన విషయాలు వెల్లడించారు. ఆపరేషన్ సిందూర్, భారత దాడుల సమయంలో పాకిస్తాన్‌ సైన్యంలో అంతర్గత పరిస్థితి ఎలా ఉందో వివరించారు.

Read Also: Keerthy Suresh: వెంకీ మామతో మహానటి జోడీ.. అనిల్ రావిపూడి స్కెచ్ మామూలుగా లేదుగా!

భారత్ వరసగా మూడు రోజులు డ్రోన్ దాడులు చేసిందని, ఆరు పాకిస్తానీ వైమానిక స్థావరాలకు స్వల్ప నష్టం కలిగిందని చిస్తీ అన్నారు. ఈ ఎపిసోడ్‌ను పాకిస్తాన్ సైనిక సంసిద్ధత, ప్రతిస్పందనకు మలుపుగా అభివర్ణించారు. ‘‘పాకిస్తాన్‌కు ప్రతిస్పందన ఇచ్చే సామర్థ్యం లేదు, సామర్థ్యం ఉంటే ధైర్యం లేదు. మొత్తం సైన్యం ఆపరేషన్ గదిలో నమాజ్ చేసింది’’ అని ఆయన అన్నారు.

మే 7, 2025న ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత బ్రహ్మోస్ క్షిపణులు రావల్పిండిలోని పాకిస్తాన్ నూర్‌ఖాన్ ఎయిర్‌బేస్‌తో సహా 10కి పైగా ఎయిర్‌బేసుల్ని ధ్వంసం చేసింది. పాకిస్తాన్‌ను కాళ్ల బేరానికి తెచ్చింది. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయకులు చనిపోయిన తర్వాత, పాక్‌కు బుద్ధి చెప్పింది. మరోసారి ఉగ్రవాద దాడి జరిగితే, ఇలాంటి ప్రతిచర్య ఉంటుందని స్పష్టం చేసింది.

Exit mobile version