Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. పాకిస్తాన్‌కి దెబ్బ, చైనాకు నొప్పి..
- ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్‌ని దెబ్బ..
- చైనా ఆయుధాలు, రాడార్లను దెబ్బకొట్టిన భారత్..
- ఒక్క క్షిపణిని ట్రాక్ చేయని hq-9 ఎయిర్ డిఫెన్స్..
- చైనా పరికరాలు, ఆయుధాల పనితీరుని బయటపెట్టిన భారత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌తో భారత్ పాకిస్తాన్ మెడలు వంచుతోంది. ఇన్నాళ్లు మేము ప్రపంచంలోనే తోపు ఆర్మీ అని ఫీల్ అవుతున్న పాకిస్తాన్‌ని, అలా నమ్ముతున్న అక్కడి ప్రజలకు నెమ్మదిగా అసలు విషయాలు తెలిసి వస్తున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకుంటోంది. ఇప్పటికే ఆపరేషన్ సిందూర్‌తో పాక్, పీఓకేలోని ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసింది. ఈ దాడిలో 100 మంది వరకు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇది చాలదన్నట్లుగా, బుధవారం-గురువారం రాత్రి సమయంలో భారత్‌పైకి క్షిపణులతో దాడులు చేసింది. ఈ దాడిని మన ‘‘ఎస్-400 సుదర్శన చక్ర’’ సమర్థవంతంగా అడ్డుకుంది.
అయితే, భారత్ దెబ్బ పాకిస్తాన్‌కి పడుతున్నా, నొప్పి మాత్రం చైనాకు కలుగుతోంది. ఎందుకంటే, భారత సైనిక పాటవాల ముందు చైనా రక్షణ వ్యవస్థలు ఒక్కటి కూడా పనిచేయడం లేదు. నిజానికి చైనా ఉత్పత్తులు అంటేనే చీప్ అనే వాదన ప్రపంచవ్యాప్తంగా ఉంది. ప్రస్తుతం భారత్ దీనిని నిరూపిస్తోంది. భారత్, పాక్ ఘర్షణలో తాము ఎంత నష్టపోతున్నామనే విషయం చైనాకు తెలిసి వస్తోంది.
Also Read
Read Also: Operation Sindoor: ఏడవడం ఒక్కటే తక్కువ.. పాకిస్తాన్ పార్లమెంటులో ఎమోషనలైన ఎంపీ.. వీడియో వైరల్!
చైనా ఎయిర్ డిఫెన్స్, క్షిపణులు ధ్వంసం:
ముఖ్యంగా, చైనా తయారీ వ్యవస్థలు భారత్ దాడుల ముందు పనిచేయడం లేదు. చైనా తయారు చేసిన పాకిస్తాన్ HQ-9 క్షిపణి రక్షణ వ్యవస్థలు దాడుల సమయంలో అస్సలు పసిగట్టలేకపోయాయి. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ పీఓకే, పాక్ పంజాబ్ ప్రావిన్సుల్లో 9 స్థావరాల్లో 24 దాడులు నిర్వహిస్తే ఒక్క క్షిపణిని కూడా గుర్తించి, అడ్డుకోలేకపోయింది.
ఇక, ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ భారత్‌లోని 15 నగరాలపై క్షిపణి, డ్రోన్ దాడులకు యత్నించింది. ఈ దాడుల్ని ఎస్-400 సుదర్శన చక్ర ఎయిర్ డిఫెన్స్ అడ్డుకుంది. ఈ దాడిలో పాక్ ఉపయోగించినవి చైనా మిస్సైల్స్ అని తేలింది. గురువారం ఉదయం భారత్ ఏకంగా లాహోర్‌లోని HQ-9 క్షిపణి రక్షణ వ్యవస్థని భారత్ ఇజ్రాయిల్ తయారీ క్షిపణులు ధ్వంసం చేశాయి.
ఈ పరిణామాలు చైనాకు మింగుడు పడటం లేదు. భారత దాడితో చైనా ఆయుధాల పనితీరును ప్రపంచానికి బహిర్గతం అయింది. రానున్న రోజుల్లో చైనా మిలిటరీ పరికరాలు, ఆయుధాలను పాకిస్తాన్ మినహా ఏ దేశం కూడా కొనే పరిస్థితి ఉండదు. ఇదిలా ఉంటే, భారత్ తన ఆకాష్ మిస్సైల్‌తో చైనా తయారీ జేఎఫ్ 17 యుద్ధ విమానాన్ని మన ఆకాష్ మిస్సైల్ కూల్చేసిందని తెలుస్తోంది. అయితే, దీనిపై పాకిస్తాన్ ఎలాంటి ప్రకటన చేయకున్నా, సోషల్ మీడియాలో మాత్రం ఇది తెగ వైరల్ అవుతోంది.
తాజావార్తలు
-
RCB Playing XI: గుజరాత్ టైటాన్స్‌ను దెబ్బకొట్టేందుకు ఆర్సీబీ పక్కా ప్లాన్.. టీమ్‌లో బిగ్ ఛేంజ్..
-
Premalu 2 : ప్రేమలు 2కి కథ లేదు అందుకే క్యాన్సిల్ చేసాం : నస్లీన్
-
NBK Lineup : తమిళ డైరెక్టర్ తో నందమూరి నటసింహం సినిమా ఫిక్స్?
-
IPL 2026 Final: బెంగళూరుకు బిగ్ షాక్.. గుజరాత్ టైటాన్స్‌దే ఐపీఎల్ 2026 టైటిల్?
-
Balka Suman: బాల్క సుమన్‌కు బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి మెజిస్ట్రేట్
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..