Parliament Session: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ పాకిస్థాన్‌పై చేపట్టిన ఆపరేషన్ సింధూర్ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఆపరేషన్‌లో పాక్‌లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసినట్టు తెలుస్తుంది. అయితే, ఈ అంశంపై పార్లమెంట్లో చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అయింది. ప్రస్తుతం జరుగుతున్న వర్షాకాల సమావేశాల్లో సోమవారం (జూలై 28న) నాడు ఆపరేషన్ సింధూర్‌పై చర్చ జరిపేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ చర్చకు లోక్‌సభలో 16 గంటలు, రాజ్యసభలో 9 గంటల సమయాన్ని కేటాయించింది. ఇక, ఇవాళ జరిగిన బీఏసీ సమావేశంలో దీనిపై కేంద్రం నిర్ణయం తీసుకుంది.
Read Also: Money Laundering Scam: CBI ముసుగులో 79 ఏళ్ల వ్యక్తి నుండి రూ.35.74 లక్షలు దోపిడీ..!
అయితే, విపక్ష పార్టీలు ఆపరేషన్ సింధూర్‌పై సంపూర్ణ వివరాలు వెల్లడించాలని గత మూడు రోజులుగా పార్లమెంట్‌లో చర్చ నిర్వహించాలని గట్టిగా డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో ఉభయ సభల్లోనూ విపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. రేపటికి పార్లమెంట్ సమావేశాలు వాయిదా పడ్డాయి. ఇక, పార్లమెంట్ ఆవరణలో ఈరోజు మీడియాతో మాట్లాడిన రాహుల్ గాంధీ.. ప్రధాని మోడీ విదేశాంగ విధానంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read Also: Delhi: చైనీయులకు శుభవార్త.. రేపటినుంచి టూరిస్ట్ వీసాలు ఇవ్వనున్న భారత్
ఇక, పాకిస్థాన్‌తో యుద్ధాన్ని తానే ఆపినట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.. దీని వెనుక కారణం ఏంటో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఇండో-పాక్ ఉద్రిక్తతల సమయంలో ఐదు యుద్ధ విమానాలు కూలిన విషయాన్ని ట్రంప్ అనేక సార్లు వ్యాఖ్యానించాడని పేర్కొన్నారు. ఒకవైపు ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోందని చెబుతునే.. మరోవైపు విజయవంతమైందని అంటున్నారు.. కానీ, డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఆపరేషన్‌ను తానే ఆపినట్టు ఇప్పటి వరకు 25 సార్లు చెప్పారని గుర్తు చేశారు. దీంట్లో ఏదో మర్మం ఉంది.. మోడీ ప్రభుత్వం విదేశాంగ విధానానికి అంతర్జాతీయ మద్దతు దొరకడం లేదని రాహుల్ గాంధీ విమర్శించారు.
