Site icon NTV Telugu

2000 Notes Exchange: 2000 నోట్ల మార్పిడికి ఇంకా 5 రోజులే సమయం.. త్వరగా మార్చుకోండి

2000 Notes

2000 Notes

చెలామణిలో ఉన్న రూ.2000 నోట్లను మార్చుకునే సమయం త్వరలో ముగియనుంది. సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఈ పెద్దనోట్లను మార్చుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డెడ్ లైన్ విధించింది. అయితే ఇంకెంతో సమయం లేదు.. కేవలం 5 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇంకా 2000 రూపాయల నోట్లను మార్చుకోకపోతే.. వెంటనే మీ దగ్గరలోని బ్యాంకుకు వెళ్లి నోట్లను మార్చుకోండి. అక్కడైతేనే ఈ నోట్లను మార్చుకునేందుకు వీలుంటుంది.

Vishwak Sen :ఆంజనేయ మాలలో విశ్వక్ సేన్.. ఫోటోలు వైరల్..

ఆర్‌బీఐ ఆదేశాల మేరకు.. ఎలాంటి పత్రాలు లేకుండా రూ.2000 నోట్లను బ్యాంకుల్లో మార్చుకుంటున్నప్పటికీ.. కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు గుర్తింపు కార్డులను అడుగుతున్నాయి. అందుకోసమని మీరు బ్యాంకుకు వెళ్లినప్పుడు మీ వెంట గుర్తింపు కార్డును తీసుకువెళ్లండి. మరోవైపు నోట్ల మార్పిడి కోసం RBIతో సహా దేశంలోని అన్ని బ్యాంకుల్లో సౌకర్యం అందుబాటులో ఉంది.

TSPSC Group 1 : తెలంగాణ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రద్దు చెయ్యొద్దు.. అప్పీలు దాఖలు చేసిన TSPSC .. రేపు విచారణ

ఇదిలా ఉంటే.. నోట్ల మార్పిడి కోసం బ్యాంకులకు వెళ్లే ముందు.. ఒకసారి సెలవు జాబితాను తనిఖీ చేయాలి. సెప్టెంబర్ 25 నుండి 27 వరకు అంటే సోమవారం నుండి బుధవారం వరకు బ్యాంకులు తెరిచి ఉంటాయి. గురువారం మిలాద్-ఉల్-నబీ సందర్భంగా బ్యాంకులకు హాలిడే ప్రకటించారు. శుక్ర, శనివారాల్లో సాధారణ సమయాల ప్రకారం బ్యాంకులు తెరవబడతాయి. రూ.2000 నోట్లను మార్చుకోవడానికి 25 నుండి 27, 29 నుండి 30 వరకు మాత్రమే మిగిలి ఉంది. కాబట్టి త్వరగా నోట్లను మార్చుకోండి.

PM Modi: కాంగ్రెస్ తుప్పుపట్టిన ఇనుము లాంటింది.. మధ్యప్రదేశ్‌లో ప్రధాని మోడీ

2016 నవంబర్ నుంచి రూ.2000 నోటును చలామణిలోకి తీసుకొచ్చారు. అదే సమయంలో రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేశారు. ఇకపోతే సెప్టెంబర్ 30 నుంచి రూ.2000 నోట్లు చెల్లుబాటు కావు. మే మూడో వారంలో రూ.2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకోసం సెప్టెంబరు 30వ తేదీ వరకు గడువు విధించి బ్యాంకులకు వెళ్లి నోట్లను మార్చుకోవాలని ఆర్బీఐ కోరింది.

Exit mobile version