Corona : మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. 23 మంది విద్యార్థులకు పాజిటివ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారి మళ్లీ రెక్కలు చాస్తోంది. కొత్తకొత్తగా రూపాంతరాలు చెంది ప్రజలపై విరుచుకుపడుతున్న కరోనా.. ఇప్పుడు మరోసారి తన ప్రభావాన్ని చూపుతోంది. యావత్తు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు కరోనా వైరస్ బారిన పడి తీవ్ర అవస్థలను ఎదుర్కొంటున్నారు. అయితే మొన్నటికి మొన్న ఒమిక్రాన్ రూపంలో థర్డ్ వేవ్ సృష్టించిన కరోనా.. ఇప్పుడు మరోసారి దేశంలో విజృంభిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని ఉత్తరప్రదేశ్ నోయిడాలో కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. గడిచిన 48 గంటల్లో 53 కరోనా కేసులు నోయిడాలో నమోదయ్యాయి.
అయితే ఈ కేసులు ఎక్కువగా పాఠశాలల్లో నమోదవుతుండడం ఆందోళన కలిగించే విషయం అయితే మొత్తం నాలుగు స్కూల్లలోని 23 మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఫస్ట్, ప్రైమరీ కాంటాక్టులకు కూడా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అక్కడి వైద్యులు వెల్లడించారు. అంతేకాకుండా ఘజియాబాద్ స్కూల్లో 13 ఏండ్ల విద్యార్థికి కరోనా సోకింది. నోయిడాలోని సెక్టార్ 40లోని ప్రైవేట్ స్కూల్లో 13 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లకు కరోనా పాజిటివ్‌గా వచ్చింది.
Also Read
- Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
- flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
- Mamata Banerjee: ‘‘ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నా’’.. బీజేపీపై మమత ఆగ్రహం..
- INDIA Bloc: ‘‘ఓట్ చోరీ’’పై ఇండీ కూటమి యాక్షన్ ప్లాన్..
దీంతో ఘజియాబాద్, నోయిడాలో పలు ప్రైవేట్ స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. రెండు రోజుల పాటు భౌతిక తరగతులను రద్దు చేసి ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే.. చైనాలో సైతం కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. చైనాలో అతిపెద్ద నగరమైన శాంఘై సిటీలో ఇప్పటికే లాక్డౌన్ విధించారు. అంతేకాకుండా ఒమిక్రాన్ వేరియంట్లోని ఎల్452ఆర్ మ్యుటేషన్ కేసులు ఇప్పటికే భారత్‌లో నమోదవుతుండడం గమనార్హం.
తాజావార్తలు
-
Meerut Blue Drum Murder: మీరట్ డ్రమ్ మర్డర్ కేసు.. ముస్కాన్-సాహిల్ దోషులుగా నిర్ధారణ.!
-
CM Chandrababu: ‘కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది’.. ఇళ్ల స్థలాల పట్టాలు అందజేసిన సీఎం..
-
Employees Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ గిఫ్ట్.. ఖాతాల్లోకి ఆ రోజే బోనస్ డబ్బులు!
-
flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
-
Mamata Banerjee: ‘‘ఇంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నా’’.. బీజేపీపై మమత ఆగ్రహం..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!