కరోనా మహమ్మారి మళ్లీ రెక్కలు చాస్తోంది. కొత్తకొత్తగా రూపాంతరాలు చెంది ప్రజలపై విరుచుకుపడుతున్న కరోనా.. ఇప్పుడు మరోసారి తన ప్రభావాన్ని చూపుతోంది. యావత్తు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు కరోనా వైరస్ బారిన పడి తీవ్ర అవస్థలను ఎదుర్కొంటున్నారు. అయితే మొన్నటికి మొన్న ఒమిక్రాన్ రూపంలో థర్డ్ వేవ్ సృష్టించిన కరోనా.. ఇప్పుడు మరోసారి దేశంలో విజృంభిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని ఉత్తరప్రదేశ్ నోయిడాలో కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. గడిచిన 48 గంటల్లో 53 కరోనా…
కరోనా రక్కసి కొత్తకొత్త వేరియంట్‌లతో ప్రజలపై విరుచుకుపడుతోంది. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్ నుంచి సబ్ వేరియంట్‌లు పుట్టుకోస్తున్నాయి. డెల్టావేరియంట్ కంటే వేగంగా వ్యాప్తి చెందే శక్తి ఒమిక్రాన్ వేరియంట్‌లకు ఉంది. అయితే మొన్నటికి మొన్న ఒమిక్రాన్ వేరియంట్ భారత్‌లోకి ప్రవేశించి పలు రాష్ట్రాల్లో వ్యాప్తి చెందుతుండడంతో వెంటనే అప్రమత్తమైన ఆయా రాష్ట్రాలు కోవిడ్ నిబంధనలు కఠినతరం చేయడమే కాకుండా, నైట్ లాక్‌డౌన్, వీకెండ్ లాక్‌డౌన్ ను విధించి థర్డ్‌వేవ్‌కు అడ్డుకట్టవేశాయి. అయితే ఇప్పుడు ఒమిక్రాన్…