Omar Abdullah: జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా రెండో పెళ్లి.. పెళ్లికూతురు ఎవరంటే..
- జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా రెండో పెళ్లి..
- జర్నలిస్ట్ నిధి రిజ్దాన్ను వివాహం చేసుకున్నట్లు ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Omar Abdullah: జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా రెండో వివాహం చేసుకున్నారు. ప్రముఖ జర్నలిస్టు నిధి రజ్దాన్ను పెళ్లి చేసుకున్నట్లు శనివారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. పెళ్లి జరిగిన మరుసటి రోజే నిధి రజ్దాన్తో కలిసి దిగిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. తమ జీవితంలో కొత్త అధ్యాయం మొదలైందని అన్నారు. ఇన్స్టాగ్రామ్లో నిధి రజ్దాన్ను ట్యాగ్ చేస్తూ ఒమర్ అబ్దుల్లా ఓ ఫొటోను పోస్టు చేశారు. “నిన్న ఒక కొత్త ప్రయాణం ప్రారంభమైంది” అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
విడాకులు తీసుకున్న 3 నెలలకే పెళ్లి..
ఒమర్ అబ్దుల్లాకు అంతకు ముందు పాయల్ అబ్దుల్లాతో వివాహమైంది. వీరిద్దరికి మూడు నెలల క్రితమే సుప్రీంకోర్టు విడాకులు మంజూరు చేసింది. 2026 జూలై 31న ఒమర్ అబ్దుల్లా, పాయల్ అబ్దుల్లా పరస్పర అంగీకారంతో తమ వివాహ బంధాన్ని ముగించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరి మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించుకోవడంతో పాటు, ఒకరిపై ఒకరు దాఖలు చేసిన కేసుల్ని విత్ డ్రా చేసుకునేందుకు అంగీకరించారు. వీరిద్దరి వివాహాన్ని రద్దు చేసేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.
Also Read
- Yogi Adityanath: 1.27 కోట్ల మంది హిందువుల ఓట్లు గల్లంతు.. యోగి సంచలన వ్యాఖ్యలు..
- Pune: కొడుకుతో సహా 18వ అంతస్తు నుంచి దూకిన మహిళ.. భర్త మరో పెళ్లి చేసుకోవాలని లేఖ!
- Rajasthan: 40 విల్లాలు, కాటేజీలు.. IAS-IPS దంపతుల అవినీతి బాగోతం..
- Punjab elections: ఆప్ తొలి జాబితా విడుదల.. ధురి నుంచి సీఎం పోటీ, జైలులో ఉన్న ఎమ్మెల్యేకు టికెట్.
1994లో ఒమర్, పాయల్ వివాహం..
ఒమర్ అబ్దుల్లా, పాయల్ అబ్దుల్లాలు 1994లో వివాహం చేసుకున్నారు. ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్లో పనిచేస్తున్న సమయంలో ఇద్దరికి పరిచయం ఏర్పడింది. వీరికి జాహిర్, జమీర్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. 2009 నుంచి ఇద్దరు వేర్వేరుగా జీవిస్తున్నారు. 2011లో తాము విడిపోయిన విషయాన్ని ఒమర్ అబ్దుల్లా ప్రకటించారు. సుప్రీంకోర్టు కూడా వీరిద్దరు చాలా కాలంగా విడివిడిగా ఉంటున్న విషయాన్ని గుర్తించింది. ఇప్పుడు జర్నలిస్ట్ నిధి రజ్దాన్తో వివాహం జరిగినట్లు ఒమర్ అబ్దుల్లా ప్రకటించారు. ఈ వార్త రాజకీయ, మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
A new journey began yesterday 💍@Nidhi https://t.co/BXbdLq2d1H
— Omar Abdullah (@OmarAbdullah) October 31, 2026
తాజావార్తలు
-
Omar Abdullah: జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా రెండో పెళ్లి.. పెళ్లికూతురు ఎవరంటే..
-
Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో మరో మ్యూజిక్ డైరెక్టర్?
-
Yogi Adityanath: 1.27 కోట్ల మంది హిందువుల ఓట్లు గల్లంతు.. యోగి సంచలన వ్యాఖ్యలు..
-
Ramayana: “నా మనసంతా హైదరాబాద్లోనే ఉంది”.. రకుల్ ప్రీత్ సింగ్ ఎమోషనల్!
-
Shekar Kammula : “వైలెన్స్ ఉంటేనే సినిమా హిట్ అనుకోవడం భ్రమ.. శేఖర్ కమ్ముల సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!