Site icon NTV Telugu

Amritpal: అమృతపాల్‌కు శుభవార్త.. ఎంపీగా ప్రమాణం చేసేందుకు స్పీకర్ గ్రీన్‌సిగ్నల్

Spekar

Spekar

ఖలిస్థాన్ వేర్పాటువాది అమృతపాల్ సింగ్‌కు లోక్‌సభ స్పీకర్ శుభవార్త చెప్పారు. జూలై 5న (శుక్రవారం) ఎంపీగా అమృతపాల్ ప్రమాణస్వీకారం చేసేందుకు అనుమతి ఇచ్చారు. ఈ మేరకు ఇండిపెండెంట్ ఎంపీ సర్భ్‌జిత్ సింగ్ ఖల్సా ధృవీకరించారు. స్పీకర్ ఛాంబర్‌లో ప్రమాణస్వీకార కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Indian Bison : నల్లమలలో 150 ఏళ్ల తర్వాత అనుకోని అతిధి.. సంబరపడిపోతున్న జంతు ప్రేమికులు..

అమృతపాల్ సింగ్ 2024 లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లోని ఖదూర్-సాహిబ్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. బుధవారం స్పీకర్‌ను కలిసి అనుమతి కోరినట్లు ఖల్సా వెల్లడించారు. లోక్‌సభలో కాకుండా.. స్పీకర్ ఛాంబర్‌లో ప్రమాణం చేసేందుకు ఓం బిర్లా అనుమతి ఇచ్చారని తెలిపారు.

ఇది కూడా చదవండి: Hemant Soren: జార్ఖండ్ సీఎంగా మళ్లీ హేమంత్ సోరెన్.. చంపై సోరెన్ అసంతృప్తి..

ఇదిలా ఉంటే అమృతపాల్‌కు జూలై 5 నుంచి నాలుగు రోజులు పెరోల్ మంజూరు చేయబడింది. అమృతసర్ జిల్లా కమిషనర్.. దిబ్రూఘర్‌లోని జైలు సూపరింటెండెంట్‌కు పెరోల్ ఆమోదాన్ని తెలియజేశారు. దీంతో అమృతపాల్ మద్దతుదారులు సంబరాలు చేసుకుంటున్నారు. పార్లమెంట్‌లో అడుగుపెట్టబోతున్నారని ఆనందోత్సవాలు చేసుకుంటున్నారు. జాతీయ భద్రతా చట్టం కింద అమృతపాల్ అస్సాం జైలులో ఉంటున్నారు.

ఇది కూడా చదవండి: Snake Video: దగ్గు సిరప్ బాటిల్ మింగిన నాగుపాము.. చివరికి ఏమైందంటే..!

Exit mobile version