Red Ant Chutney: "ఎర్ర చీమల పచ్చడి" గిరిజనులకు ఎంతో ముఖ్యమైన వంటకం. ఇప్పటికీ ఆదివాసుల్లో ప్రధాన వంటకంగా ఉంటుంది. నాగరికతకు అలవాటు పడిన మనకు ఇది కొద్దిగా కొత్తగా అనిపించవచ్చు. అయితే, ఒడిశాలోని ‘ఎర్ర చీమల పచ్చడి’కి భౌగోళిక గుర్తింపు(GI ట్యాగ్) లభించింది. ఈ వంటకంలో అనేక పోషక విలువలు ఉన్నట్లు పరిశోధకులు కనుగొన్నారు.