Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Odisha Mla Prasanta Kumar Jagadev Rams Car Into Crowd In Khurda

MLA Jagadev: జనం పైకి దూసుకెళ్లిన ఎమ్మెల్యే కారు.. ఒకరు మృతి, ఎమ్మెల్యేపై దాడి..

Published Date :March 12, 2022 , 4:19 pm
By Sudhakar Ravula
MLA Jagadev: జనం పైకి దూసుకెళ్లిన ఎమ్మెల్యే కారు.. ఒకరు మృతి, ఎమ్మెల్యేపై దాడి..
  • Follow Us :
  • google news
  • dailyhunt

లఖింపూర్‌‌ ఖేరీ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.. సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ నిరసన తెలుపుతున్న రైతులపైకి ఆశిశ్ మిశ్రా కాన్వాయ్‌లోని ఓ కారు దూసుకెళ్లిన ఘటనలో అక్కడికక్కడే నలుగురు రైతులు మృతి చెందారు. ఆ తర్వాత జరిగిన ఘర్షణల్లో మరో నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఇలాంటి ఘటనే ఇప్పుడు ఒడిశాలో కలకలం రేపుతోంది.. ఒడిశా ఖుర్దాలో ప్రజలపైకి దూసుకెళ్లింది ఎమ్మెల్యే ప్రశాంత్​జగ్‌దేవ్​కారు… ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. 25 మందికి పైగా గాయాలపాలైనట్టు తెలిపారు. గాయపడినవారిలో దాదాపు 15 మంది బీజేపీ కార్యకర్తలుగా తెలుస్తుండగా.. 10 మంది పోలీసు సిబ్బంది కూడా ఉన్నట్టు చెబుతున్నారు.. వారిని వెంటనే భువనేశ్వర్​ఎయిమ్స్​కు తరలించారు.

Read Also: EPFO: ఖాతాదారులకు భారీ షాక్‌..! వడ్డీ రేటు కోత..!

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఖుర్దాలో పంచాయతీ సమితి చైర్‌పర్సన్ ఎన్నికలు జరుగుతున్నాయి.. బాన్‌పుర్ బ్లాక్ కార్యాలయం ఎదుట.. ప్రజలు, బీజేపీ కార్యకర్తలు గుమ్మిగూడి ఉండగా.. బీజేడీ బహిష్కృత ఎమ్మెల్యే ప్రశాంత్‌ జగ్‌దేవ్‌ కారు వారికిపైకి దూసుకెళ్లింది.. 25 మందికి పైగా తీవ్ర గాయాలపాలు కావడంతో.. ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలు.. ఆ వెంటనే ఎమ్మెల్యే కారుపై దాడి చేశారు.. వాహనాన్ని ధ్వంసం చేశారు… ఎమ్మెల్యేను బటయకు లాగి దాడికి పాల్పడ్డారు.. ఈ సమయంలో సదరు ఎమ్మెల్యే మద్యం సేవించి ఉన్నట్టుగా చెబుతున్నారు స్థానికులు.. ఇక, వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ దాడి నుంచి ఎమ్మెల్యేను కాపాడి.. ఆస్పత్రికి తరలించారు.. ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ప్రజలు ఎమ్మెల్యేను తీవ్రంగా కొట్టడంతో.. మొదట తంగి ఆసుపత్రిలో చేరిన తరువాత భువనేశ్వర్‌లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని ఖుర్దా ఎస్పీ అలేఖ్ చంద్ర పాహి మీడియాకు తెలిపారు.. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఎన్నికల ర్యాలీలో బీజేపీ మద్దతు ఉన్న పంచాయతీ సమితి సభ్యులు బ్లాక్ కార్యాలయంలోకి ప్రవేశిస్తుండగా, అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే వాహనం వారిపైకి దూసుకెళ్లినట్టు చెబుతున్నారు.. ఈ ఘటనలో బాణాపూర్ ఐఐసీ, ఎమ్మెల్యే, జర్నలిస్టు సహా పది మంది పోలీసులు, కనీసం ఆరుగురికి గాయాలయ్యాయని ఎస్పీ తెలిపారు. కాగా, సెప్టెంబర్‌లో సీఎం నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజూ జనతాదళ్ (బిజెడి) ఎమ్మెల్యే అయిన జగదేవ్… తన నియోజకవర్గంలో బీజేపీ నేతను కొట్టిన వీడియో వైరల్‌ కావడంతో అతనిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bhubaneswar
  • car
  • Crowd
  • hospital
  • Khurda

తాజావార్తలు

  • Sanju Samson: సంజు శాంసన్‌కు ఏమైంది..? వరల్డ్‌ కప్‌లో అలా.. ఐపీఎల్‌లో ఇలా ఏంటి..?

  • Sharwanand :శర్వానంద్ కి ఏమైంది? సక్సెస్ మీట్లలో ఆవేశం.. మాటల్లో తడబాటు.. అసలు కారణం ఇదేనా?

  • Rajya Sabha: శరద్ పవార్ సహా పలువురు రాజ్యసభ ఎంపీలుగా ప్రమాణం

  • Sharanya Rescue: ట్రెక్కింగ్ చేస్తూ గల్లంతైన టెకీ సేఫ్.. నో ఫుడ్, నో నెట్‌వర్క్… ధైర్యంతో 4 రోజులు! శరణ్య స్టోరీ

  • Pradeep Ranganathan:దిల్ రాజు ఐడియా వలనే.. నాకు తెలుగులో ఇంత క్రేజ్ వచ్చింది

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions