లఖింపూర్ ఖేరీ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.. సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ నిరసన తెలుపుతున్న రైతులపైకి ఆశిశ్ మిశ్రా కాన్వాయ్‌లోని ఓ కారు దూసుకెళ్లిన ఘటనలో అక్కడికక్కడే నలుగురు రైతులు మృతి చెందారు. ఆ తర్వాత జరిగిన ఘర్షణల్లో మరో నలుగురు రైతులు ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఇలాంటి ఘటనే ఇప్పుడు ఒడిశాలో కలకలం రేపుతోంది.. ఒడిశా ఖుర్దాలో ప్రజలపైకి దూసుకెళ్లింది ఎమ్మెల్యే ప్రశాంత్జగ్దేవ్కారు… ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. 25 మందికి పైగా గాయాలపాలైనట్టు తెలిపారు.…