Odisha: స్నేహితులతో కలిసి సోదరిని అత్యాచారం చేసిన కామాంధుడు.. గొడ్డలితో నరికి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళల రక్షణ కోసం ఎన్నో రకాల చట్టాలను తీసుకొని వస్తున్నారు.. అయిన మహిళలకు రక్షణ లేకుండా పోయింది.. సొంతవాళ్ళే రాబంధులగా మారి జీవితాలను నాశనం చేస్తున్నారు.. తాజాగా అత్యంత అమానుష ఘటన చోటు చేసుకుంది.. సొంత సోదరి అని మర్చిపోయి కామంతో రెచ్చిపోయాడు ఓ దుర్మార్గుడు.. వావి వరుసలు కూడా మరచి దారుణంగా అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. ఈ దారుణ ఘటన ఒడిశాలో వెలుగు చూసింది..ఓ వ్యక్తి, తన స్నేహితులతో కలిసి, తన సోదరిని గ్యాంగ్ రేప్ చేశాడు. అనంతరం ఆమెను గొడ్డలితో నరికి చంపేశాడు..
వివరాల్లోకి వెళితే.. ఒడిశా కంథమాల్ జిల్లాలోని చకపాడ్ పోలీస్ స్టేషన్ పరిథిలో.. నవంబర్ 3న జరిగింది ఈ ఘటన. నేరస్థులను పోలీసులు పట్టుకోవడంతో, ఈ వార్త బయటకు వచ్చింది. కొన్ని నెలల క్రితం.. స్థానికంగా నివాసముండే 25ఏళ్ల మహిళకు తన సోదరుడితో గొడవ జరిగింది. తన భర్త సోదరితో, అతను అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలియడంతో.. సోదరుడిని మందలించింది. ఆమెకు దూరంగా ఉండాలని హెచ్చరించింది. లేకపోతే అందరికి చెప్పేస్తానని బెదిరించింది. కానీ ఆ వ్యక్తి, సోదరి మాట వినలేదు. ఇద్దరి మధ్య గొడవ పెరిగింది..
Also Read
- Harassment: మారండ్రా బాబు.. మరో దారుణం.. రోడ్డుపై మైనర్ బాలికపై వేధింపులు
- Import Duty Cuts on Edible Oils: పండుగలకు ముందే ఊరట.. వంట నూనెలపై గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం..
- Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ నాలుగు ముక్కలు? విభజన డిమాండ్ వెనుక ఉన్న కారణాలివే!
- September 2026 Salary Update: కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. సెప్టెంబర్ జీతం, పెన్షన్ రేపే ఖాతాల్లోకి!
దాంతో కోపంతో రగిలిపోయిన అతను ఆమె అడ్డు తొలగించుకోవాలని ఫిక్స్ అయ్యాడు.. నవంబర్ 3న మహిళ.. పని మీద అడవుల్లోకి వెళ్లింది. ఆమె, ఆరోజున, అక్కడకి వస్తుందని ముందే తెలుసుకున్న ఆ మహిళ సోదరుడు.. తన నలుగురు స్నేహితులను పిలిపించాడు. వారి చేత మద్యం తాగించాడు. ఆమె కనిపించేసరికి.. వారందరు మహిళపై పడ్డారు. తొలుత.. ఆ వ్యక్తి, తన సోదరిని రేప్ చేశాడు. అనంతరం.. స్నేహితుల చేత రేప్ చేయించాడు. మహిళ గట్టిగా అరుస్తోందని.. ఆమె గొంతు నులిమాడు. అక్కడితో ఆగకుండా.. గొడ్డలితో నరికాడు. ఆమె అక్కడిక్కడ ప్రాణాలు కోల్పోయింది..
మహిళ కనిపించలేదని కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. తమ బిడ్డ కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. నవంబర్ 6న.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టగా.. నవంబర్ 7, అడవుల్లో వారికి ఒక మహిళ మృతదేహం లభించింది. ఆమె తమ బిడ్డేనని, కుటుంబసభ్యులు ధ్రువీకరించారు.. పోస్ట్ మార్టం చేసి గ్యాంగ్ రేప్ జరిగినట్లు నిర్దారించారు.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు రెండు రోజుల క్రితం ఆ దుర్మార్గుడు ని అరెస్ట్ చేశారు.. అతడి స్నేహితులను కూడా అదుపులోకి తీసుకున్నారు.మరోవైపు.. ఈ వార్త స్థానికంగా కలకలం సృష్టించింది. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.. దేశ వ్యాప్తంగా ఈ ఘటన సంచలనం రేపుతుంది..
- Tags
- Latest Crime News
- Odisha
తాజావార్తలు
-
Hyderabad Metro: వినాయక భక్తులకు గుడ్ న్యూస్.. నిమజ్జనం వేళ హైదరాబాద్ మెట్రో టైమింగ్స్ మార్పు.! లాస్ట్ రైలు ఎప్పుడంటే?
-
Kakumanu Rajasekhar Death: వైసీపీలో విషాదం.. కాకుమాను రాజశేఖర్ ఆకస్మిక మృతి.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
-
Sanjay Leela Bhansali : రణబీర్ కపూర్ ‘లవ్ అండ్ వార్’ ఫస్ట్ లుక్ రిలీజ్
-
CM CBN Reviews on Heavy Rains: వర్షాలపై సీఎం చంద్రబాబు మరోసారి సమీక్ష.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
-
MIVI ONE 5G: మివి వన్ 5G భారత్‌లో లాంచ్.. Snapdragon 4 Gen 2, 120Hz డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీ
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!