JNU protest: 2020 ఢిల్లీ మత అల్లర్ల కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్‌లకు సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించింది. అయితే, దీనిని వ్యతిరేకిస్తూ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (JNU) విద్యార్థులు ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షా, బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లను టార్గెట్ చేస్తూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. మరోసారి, జేఎన్‌యూలో తుక్డే తుక్డే గ్యాంగ్ హల్చల్ చేసింది. ప్రధాని మోడీ, అమిత్ షాలకు జేఎన్‌యూలో సమాధి తవ్వుతామని విద్వేష వ్యాఖ్యలు చేశారు.
Read Also: Mukesh Ambani: రిలయన్స్‌కు ట్రంప్ ఎఫెక్ట్.. లక్ష కోట్లు లాస్ అయిన ముఖేష్ అంబానీ
సోమవారం రాత్రి జేఎన్‌యూలో నిరసన ప్రదర్శన జరిగింది. ఈ వ్యవహారంపై యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షురాలు అదితి మిశ్రా మాట్లాడుతూ.. జనవరి 5, 2020న క్యాంపస్‌లో జరిగిన హింసను ఖండిస్తూ విద్యార్థులు ప్రతి సంవత్సరం నిరసన ప్రదర్శన నిర్వహిస్తారని అన్నారు. “నిరసన సమయంలో లేవనెత్తిన నినాదాలన్నీ సైద్ధాంతికమైనవి మరియు ఎవరినీ వ్యక్తిగతంగా దాడి చేయలేదు. అవి ఏ వ్యక్తిని లక్ష్యంగా చేసుకోలేదు” అని చెప్పింది.
అయితే, దీనిని ఢిల్లీ మంత్రులు ఆశిష్ సూద్, మంజీందర్ సింగ్ సిర్సా ఈ సంఘటనను ఖండించారు మరియు అటువంటి చర్యలకు మద్దతు ఇస్తున్నందుకు ప్రతిపక్షాలను నిందించారు. ఈశాన్య రాష్ట్రాలను వేరు చేస్తామని షర్జీల్ ఇమామ్ మాట్లాడాడని, ఉమర్ ఖలీద్ భారత్‌ను ముక్కలుగా చేయాలని నినాదాలు చేశారని అన్నారు. 2020 ఢిల్లీ అల్లర్లలో అతడి ప్రమేయం ఉందని అన్నారు. కొంత మంది జేఎన్‌యూను తుక్డే తుక్డే గ్యాంగులకు నియలంగా మార్చారరని, రాహుల్ గాంధీ, టీఎంసీ, కమ్యూనిస్టులు ఈ ముఠాలో భాగమే అని కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు.
"मोदी-शाह की कब्र खुदेगी, JNU की धरती पर"
जवाहर लाल यूनिवर्सिटी कैंपस दिल्ली में कल रात उमर खालिद और शरजील इमाम के समर्थन में जुलूस निकाला aur नारेबाजी हुई।#modi #amitshah #jNu #umarkhalid #SharjilImam pic.twitter.com/BwHdSVqw8e
— Rajat Kumar (@rajatrampur22) January 6, 2026