Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఈ రోజు ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో స్థానికేతర కార్మికుడు మరణించగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వ్యక్తిని పంజాబ్ అమృత్‌సర్‌కి చెందిన అమృత్ పాల్ సింగ్‌గా గుర్తించారు. క్షతగాత్రుడి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటన శ్రీనగర్ పట్టణంలోని షహీద్ గంజ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఘటన జరిగిన ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. దాడికి పాల్పడిన వారి ఆచూకీ కోసం పోలీసులు విస్తృతంగా…