Jairam Ramesh: కాంగ్రెస్ లేకుండా బీజేపీని ఎదుర్కోవడం ఏ ఫ్రంట్‌కు సాధ్యం కాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jairam Ramesh: కాంగ్రెస్ లేకుండా బీజేపీ ఎదుర్కోవడం ఏ ఫ్రంట్ కు సాధ్యం కాదని, 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఏర్పడితే అందులో కాంగ్రెస్ పార్టీదే ప్రధాన పాత్ర అని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ అన్నారు. అయితే రాబోయే కర్ణాటక ఎన్నికలతో పాటు ఇతర రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయని, ఇప్పుడే పొత్తుల గురించి మాట్లాడటం తొందరపాటు అవుతుందని ఆయన అన్నారు. ఇటీవల బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో భేటీ అయిన సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ లేకుండా కొత్త ఫ్రంట్ ఏర్పాటు చేస్తామన్న నేపథ్యంలో జైరాం రమేష్ ఈ వ్యాఖ్యలు చేశారు.
READ ALSO: Women’s Health: గర్భాశయ క్యాన్సర్ రాకుండా ఈ చిట్కాలు పాటించండి..
Also Read
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
- CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ఇండియా కూటమిలోకి విజయ్ పార్టీ TVK!
కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరాంలలో ఎన్నికలు ఉన్నాయని ప్రస్తుతం కాంగ్రెస్ వాటిపై దృష్టి సారిస్తోందని అన్నారు. వీటి తర్వాతే 2024 లోక్ సభ ఎన్నికల గురించి ఆలోచిస్తాం అని తెలిపారు. ఏ ప్రతిపక్ష కూటమి అయిన బలపడాలంటే కాంగ్రెస్ అవసరం తప్పనిసరి అని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆలోచన కర్ణాటక ఎన్నికలపైనే అని తెలియజేశారు. 2024 ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జన ఖర్గే పార్టీ నేతలతో చర్చలు జరుపుతారని తెలిపారు.
ఆదానీ అంశంపై ప్రతిపక్షాలు చేస్తున్న నిరసనల్లో తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ పాల్గొనకపోవడంపై స్పందింస్తూ ఆ పార్టీలకు సొంత లాజిక్ ఉండొచ్చని అన్నారు. ఇటీవల 16 పార్టీలు ఈ అంశంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని సంతకాలు చేశాయి. దీనికి టీఎంసీ, ఎన్సీపీ దూరంగా ఉన్నాయి. ప్రస్తుతం మా గొంతు వినిపించేలా ప్రయత్నాలు చేస్తున్నామని, మాపై తప్పుడు ప్రచారం, వేధింపులు జరుగుతున్నాయని, రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ప్రయత్నిస్తున్న ఈ వేధింపులను మేము ఎదుర్కొంటాం తెలిపారు. అదానీ, చైనా వ్యవహారంపై చర్చించేందుకు ప్రతిపక్షాలను అనుమతించడం లేదని ఆయన విమర్శించారు. భారత్ జోడో యాత్ర వల్ల కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ఇమేజ్ పెరిగిందని, ఇది బీజేపీని ఆందోళనకు గురిచేస్తోందని ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!