Site icon NTV Telugu

Rajeev Chandrasekhar: ముస్లింలు మాకు ఓటేయరు, అందుకే మంత్రి పదవి లేదు..

Rajeev Chandrasekhar

Rajeev Chandrasekhar

Rajeev Chandrasekhar: కేరళ బీజేపీ అధ్యక్షుడు , మాజీ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కోజికోడ్‌లో కేంద్ర మంత్రివర్గంలో ముస్లింలకు ప్రాతినిధ్యం లేదని చెప్పిన తర్వాత రాజకీయ దుమారం చెలరేగింది. మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ముస్లిం మంత్రులు లేకపోవడంపై మాట్లాడుతూ, ముస్లిం ఎంపీలు లేకపోవడమే కారణమని అన్నారు. ‘‘ముస్లింలు మాకు ఓటేయడం లేదు. ఆ సంఘం మాకు మద్దతు ఇవ్వకుంటే మేము ఏం చేయగలం.? ముస్లింల నుంచి ఎంపీలు లేనందున కేంద్ర మంత్రివర్గంలో మంత్రులు లేరు’’ అని అన్నారు.

Read Also: Railway Rules: ట్రైన్ లో ఎలక్ట్రిక్ కెటిల్ వాడితే.. ఎన్నేళ్ల జైలు శిక్ష విధిస్తారో తెలుసా?

ఈ పరిస్థితిని ‘‘కోడి-గుడ్డు’’ సమస్యగా అభివర్ణించారు. బీజేపీ, ఎన్డీయే ప్రభుత్వంలో గతంలో షానవాజ్ హుస్సేన్, ముఖ్తాన్ అబ్బాస్ నఖ్వీ తో సహా ముస్లిం ప్రతినిధులు ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. బీజేపీకి కాశ్మీర్ నుంచి కూడా ప్రాతినిధ్యం ఉందని అన్నారు. ముస్లింలు కాంగ్రెస్‌కు ఎందుకు ఓటు వేస్తూనే ఉన్నారు, అలా చేయడం వల్ల సమాజానికి ఏమైనా ప్రయోజనం ఉందా? అని చంద్రశేఖర్ ప్రశ్నించారు.

Exit mobile version