Site icon NTV Telugu

Bihar: 10వ సారి సీఎంగా నితీష్ కుమార్.. డిప్యూటీలు వీరే..

Bihar

Bihar

Bihar: బీహార్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరేందుకు సిద్ధమైంది. నితీష్ కుమార్ 10వసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. బుధవారం, పాట్నాలో జరిగిన ఎన్డీయే ఎమ్మెల్యేల సమావేశంలో నితీష్‌ను తమ నాయకుడిగా ఎన్నికయ్యారు. ఆయన పేరును బీజేపీ నేత, ఇటీవల ఎమ్మెల్యేగా గెలిచిన సామ్రాట్ చౌదరి ప్రతిపాదించారు. అందరు ఎమ్మెల్యేలు కూడా దీనికి మద్దతు ఇచ్చారు. ఇప్పటికే, నితీష్ కుమార్ గవర్నర్ ఆరిఫ్‌ను కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు సమయాన్ని కోరారు.

Read Also: Rajamouli : దేవుడిపై రాజమౌళి కామెంట్స్.. పాత వీడియోలతో పెరిగిన రచ్చ

నవంబర్ 20న పాట్నాలోని గాంధీ మైదాన్‌లో ప్రమాణస్వీకారం కార్యక్రమం జరగబోతోంది. దీనికి ప్రధాని నరేంద్రమోడీతో సహా ఎన్డీయే నాయకులు అంతా హాజరవనున్నారు. నితీష్ కుమార్ 10 సారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయన తొలిసారిగా 2000 సంవత్సరంలో సీఎం అయ్యారు. కానీ మెజారిటీ సాధించకపోవడంతో 7 రోజుల్లోనే రాజీనామా చేశారు. ఆ తర్వాత 2005లో ఆర్జేడీ పాలనను అంతమొదిస్తూ భారీ విజయంతో తిరిగి అధికారంలోకి వచ్చారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో 243 సీట్లకు గానూ ఎన్డీయే కూటమి 202 సీట్లను గెలుచుకుంది. మరోసారి నితీష్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడబోతోంది. డిప్యూటీ సీఎంలుగా బీజేపీకి చెందిన సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హాలు పదవీ స్వీకారం చేయనున్నారు. 18-20 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచారం.

Exit mobile version