Rajamouli : రాజమౌళి వారణాసి ఈవెంట్ లో హనుమంతుడిపై చేసిన కామెంట్స్ ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే రాజమౌళిపై పోలీసులకు కొందరు ఫిర్యాదు చేయగా.. హిందూ సంఘాల నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈవెంట్ లో చేసిన కామెంట్ ఒక ఎత్తు అయితే.. గతంలో త్రిబుల్ ఆర్ ప్రమోషన్లలో రాజమౌళి చేసిన కామెంట్స్ ను ఇప్పుడు తెరమీదకు తీసుకొచ్చి నానా రచ్చ చేస్తున్నారు కొందరు నెటిజన్లు. ఆ వీడియోల్లో తాను దేవుడిని నమ్మనని.. తాను వర్క్ రూపంలో మాత్రమే దేవుడిని చూస్తానని రాజమౌళి అన్నాడు.
Read Also : Amala : కుక్క ఎవరిని కరిచినా నన్నే తిడతారు.. అమల షాకింగ్ కామెంట్స్
సృష్టిని దేవుడే నడిపిస్తాడంటే నమ్మే వ్యక్తిని కాదని.. అందరూ దేవుడిని నమ్మే పద్ధతిలో తాను నమ్మలేనని తెలిపాడు. కేవలం వర్క్ విషయంలో దేవుడిని చూస్తానన్నాడు. ఇంకేముంది ఆ వీడియోలు మళ్లీ మళ్లీ వేస్తూ రాజమౌళి దేవుడికి పూర్తి వ్యతిరేకం అన్నట్టు తెగ ట్రోల్ చేసేస్తున్నారు. అయితే ఇంత రచ్చ జరుగుతున్నా సరే రాజమౌళి మాత్రం ఇంకా స్పందించట్లేదు. వాస్తవానికి రాజమౌళి తన సినిమాల్లో దేవుళ్లను అద్భుతంగా చూపిస్తాడు. ఇప్పుడు వారణాసిలో కూడా రాముడు, హనుమంతుడిని ఎంతో అద్భుతంగా చూపించాలని సినిమా తీస్తున్నాడు. ఇలాంటి టైమ్ లో ఈ వివాదాన్ని పెద్దది చేసుకోకుండా ఏదో ఒక క్లారిటీ ఇస్తే బాగుండని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు.
Read Also : Maoists killed: మూడు రోజులుగా కూంబింగ్.. ఏడుగురు మావోయిస్టులు మృతి!