Nitesh Rane: మరాఠీ భాషపై ఇద్దరు సోదరులు రాజ్‌ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే కలిసిపోయారు. 20 ఏళ్ల తర్వాత, ఒకే వేదికను పంచుకున్నారు. ఇకపై తాము కలిసి ఉంటామని స్పష్టం చేశారు. ప్రాథమిక పాఠశాల్లో త్రిభాషా విధానంలో భాగంగా హిందీని ప్రవేశపెట్టడాన్ని ఠాక్రే సోదరులు వ్యతిరేకించారు. మరాఠీలపై హిందీ రుద్దాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు.