Nirmala Sitaraman: క్రిప్టో కరెన్సీపై నిషేధం విధించడం కుదరదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nirmala Sitaraman on Crypto Currency: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ లోక్‌సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. క్రిప్టోకరెన్సీ కోసం నిబంధనలను రూపొందించాలని, వాటిని నిషేధించే అంశాన్ని కూడా పరిశీలించాలని ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రభుత్వాన్ని కోరిందని నిర్మలా సీతారామన్ అన్నారు. అయితే దేశంలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా క్రిప్టో కరెన్సీని నిషేధించడం కుదరదని ఆమె స్పష్టం చేశారు. అంతర్జాతీయంగా ఇతర దేశాల సహకారం ఉంటేనే క్రిప్టో కరెన్సీని బ్యాన్ చేయగలమని ఆమె తెలిపారు. లేదంటే క్రిప్టో కరెన్సీపై ఎలాంటి పైచేయి సాధించలేమని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
Read Also: Har ghar Tiranga: ఇంటింటా మువ్వన్నెల జెండా.. దేశభక్తి గుండెల నిండా..
Also Read
క్రిప్టోకరెన్సీపై లోక్‌సభలో ఎంపీ తిరుమావళవన్థోల్ అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం ఇచ్చారు. దేశంలో ఆర్ధిక వ్యవస్థ స్థిరంగా ఉండాలంటే క్రిప్టోకరెన్సీల ప్రభావం తగ్గించాలని.. దీనిపై చట్టం చేయాలని ఆర్బీఐ గతంలో సిఫారసు చేసిందని నిర్మలా సీతారామన్ చెప్పారు. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ టి.రబిశంకర్ మాట్లాడుతూ.. క్రిప్టోకరెన్సీలను నిషేధించడం భారతదేశానికి అత్యంత అవసరమని అభిప్రాయపడ్డారు. దేశంలో ఆర్ధిక వ్యవస్థ బలపడాలంటే క్రిప్టో కరెన్సీలను నిషేధించాల్సిన అవసరముందన్నారు.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!